ETV Bharat / politics

గంటకు 120కిలో మీటర్ల వేగం-బ్రేక్‌ పై కాలు వేయకుండా చెన్నై బెంగళూరులకు రయ్‌..రయ్ - Bangalore Chennai Expressway

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 12:00 PM IST

దక్షిణ భారత దేశంలో మౌలిక వసతులు కల్పన, పారిశ్రామిక వృద్ధికి తోడ్పాటు అందించే చెన్నై - బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారి ప్రారంభానికి సిద్ధమైంది. కేంద్ర భూ ఉపరితల రవాణాశాఖ ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ వేను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఇది జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్‌లోనూ 65కిలీమీటర్ల దూరం విస్తరించి ఉంటుంది. అటు కర్నాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్య విస్తరణ చిత్తూరు జిల్లా కీలకం కానుంది.

చెన్నై బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌
చెన్నై బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ (ETV Bharat)

Bangalore chennai expressway : తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్న చెన్నై-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.17,930 కోట్లు వ్యయం చేశారు. ఈ సంవత్సరం డిసెంబర్‌ నాటికి రహదారి పూర్తి స్థాయిలోఅందుబాటులోకి రానుంది. ఈ నాలుగు వరుల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డ్‌ కర్నాటకలో మొత్తం 110 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 65కి.మీటర్లు, మిగతా 105కిలో మీటర్లు తమిళనాడు గుండా చెన్నై వరకు నిర్మించారు. ప్రస్తుతం చెన్నై- బెంగళూరు మధ్య దూరం 360కి.మీటర్లు కానీ ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వల్ల దాదాపు 80కిలోమీటర్ల దూరం తగ్గింది. రహదారి నిర్మాణంతో బెంగళూరు నుంచి చెన్నైకు కేవలం ఐదు గంటల్లో చేరుకోవచ్చు.

రాష్ట్రంలో హైవేల విస్తరణకు కేంద్రం గ్రీన్​సిగ్నల్

రహదారికి ఇరువైపులా పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే బెంగళూరు గ్రామీణ జిల్లాలో నరసాపుర పారిశ్రామిక వాడ, కోలారు, ముళబాగిలు, టమక పారిశ్రామిక వాడలు మరింత వృద్ధి చెందనున్నాయి. రవాణా వ్యవస్థ ఉన్నందున పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందే అవకాశం చాలా ఎక్కువ. హొసకోట శివార్ల నుంచి దేవనహళ్లి, హోసూరు, తుమకూరు తదితర ప్రాంతాలకు వెళ్లే విధంగా రింగ్‌ రోడ్డు వంతెనలను నిర్మించారు. వాహనాలు ఎక్కడా ఆగకుండా సంచరించే విధంగా రహదారిని అభివృద్ధి చేశారు. కోలారు, చిత్తూరు ప్రాంతాలతో పాటు పారిశ్రామిక వాడల నుంచి నేరుగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే విధంగా రహదారిని అభివృద్ధి చేశారు. రహదారి వల్ల సమయం, ఇంధనం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ వెలుగు రేఖ

ఆంధ్రప్రదేశ్‌లో ఈ జాతీయ రహదారి దాదాపు 65కిలోమీటర్లు ఉంది. వెంకటగిరి, పలమనేరు, బంగారుపాలెం, చిత్తూరు, రాణిపేట్‌ మీదుగా తమిళనాడులో ప్రవేశిస్తుంది. తమిళనాడులో శ్రీపెరంబూర్‌, నుంచి చెన్నై నగరానికి చేరుకోవచ్చు.

అమరావతి మహానగరికి ఓఆర్​ఆర్​ హారం

  • బెంగుళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్ వే ప్రత్యేకతలు(Bangalore chennai expressway)
  • చెన్నై- బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ వే దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ఎన్నో లక్ష్యాలను నెరవేర్చనుంది.
  • బెంగళూరు మరియు చెన్నై రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం, చెన్నై నుంచి బెంగళూరు చేరుకోవడానికి 5 నుంచి 6 గంటలు పడుతుంది, కొత్త ఎక్స్‌ప్రెస్‌ వే పై ఈ ప్రయాణ సమయం దాదాపు 2గంటలకు తగ్గనుంది.

  • రెండు మహా నగరాల మధ్య దూరం కూడా 80 కి.మీ తగ్గింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై అనుమతించబడిన వేగం గంటకు 120కి.మీ.
  • ఈ ఎక్స్‌ప్రెస్ వేపై 41చోట్ల అండర్‌పాస్‌లు, 17ఫ్లై ఓవర్స్‌ నిర్మించారు.
  • రహదారిపై ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల భద్రతా పరీక్షలకు అనుగుణంగా నిర్మాణం చేశారు.
  • బెంగుళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్ వే చెన్నై నుంచి బెంగుళూరు మధ్య పలు చోట్ల పారిశ్రామిక వాడలను అనుసంధానిస్తుంది. ఈ ప్రాంతంలో తయారీ, రవాణా రంగం మరింతగా వృద్ధి చెందనుంది.
  • ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రక్ బేలు, వాహనాలు, జంతువుల కోసం అండర్‌పాస్‌లు, పాదచారులు , ట్రాఫిక్ పరిపాలన వ్యవస్థలు వంటి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి.
  • ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో ఉన్న నగరాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు అద్భుతమైన ఆకర్షణగా మారింది. స్థిరాస్తి ధరలు ఈ ప్రాంతంలో బాగా పెరిగాయి.
  • కర్ణాటకలోని ఆటోమొబైల్ హబ్ హోస్కోట్‌ ప్రాంతం నుంచి ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం అవుతోంది. ఫలితంగా ఈ ప్రాంతంలోఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.