ETV Bharat / politics

దేశాన్ని 4 ముక్కలు చేసి విభజించిన మూర్ఖత్వపు పార్టీ కాంగ్రెస్‌ : బండి సంజయ్​ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Bandi Sanjay Comments on Ponnam Prabhakar : రాష్ట్రానికి పదేళ్లపాటు బీజేపీ అన్యాయం చేసిందంటూ మంత్రి పొన్నం ఈ నెల 14న చేపట్టనున్న దీక్షపై ఆ పార్టీ నేత, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆయన, మంత్రి పొన్నం ప్రభాకర్​, మాజీ ఎంపీ వినోద్​ కుమార్​లపై విరుచుకుపడ్డారు.

BANDI SANJAY ON CONGRESS
Bandi Sanjay Comments on Ponnam Prabhakar
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 6:57 PM IST

Bandi Sanjay Comments on Ponnam Prabhakar : రాష్ట్రంలో పదేళ్ల పాటు బీజేపీ అన్యాయం చేసిందంటూ ఈ నెల 14న కరీంనగర్​లో దీక్ష చేపడతానన్న మంత్రి పొన్నం ప్రభాకర్​ నిర్ణయంపై బీజేపీ జాతీయ ​ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం, మాజీ ఎంపీ వినోద్​ కుమార్​లపై విరుచుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పినందుకు మంత్రి పొన్నం గాంధీభవన్​ వద్ద దీక్ష చేపట్టాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్(KCR) పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు ఒక్కనాడైనా పొన్నం దీక్ష చేయలేదని ప్రశ్నించారు.

ఇవాళ జగిత్యాలలో కథలాపూర్​ మండలంలో పర్యటించిన కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​, అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప, కొనుగోలు మాత్రం చేయడం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులకు తప్పకుండా బోనస్‌ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. బీఆర్​ఎస్(BRS)​ పాలనలో వడ్ల కొనుగోలుపై నానా అవస్థలు పడిన రైతులకు అండగా బీజేపీ నిలిచిందని తెలిపారు.

Bandi Sanjay on Congress : దేశాన్ని నాలుగు ముక్కలు చేసి విభజించిన మూర్ఖత్వపు పార్టీ కాంగ్రెస్‌ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియని కాంగ్రెస్​కు ప్రజలు ఎలా ఓటేస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని అభ్యర్థి దొరకని కాంగ్రెస్​, తనను ఓడించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్​, నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. దేశంలో అభివృద్ధి కొనసాగాలని మళ్లీ ప్రధానిగా మోదీని ప్రజలు కోరుకుంటున్నారని, ఇవి ప్రధాన మంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికలను చెప్పారు.

'కాంగ్రెస్​ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు ? ఎవరిని చూసి ఓటు వేయాలి. స్పష్టమైన విధానం లేదు కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందుకే ఆ కూటమి నుంచి కొందరు వెళ్లిపోయారు. దేశాన్ని కాపాడేది కేవలం నరేంద్రమోదీ ప్రభుత్వం. ఇవి మోదీ ఎన్నికలు. నరేంద్రమోదీకి ఎట్టిపరిస్థితిల్లో ఓటు వేస్తామని ప్రజలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ 17 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. పదేళ్లలో ఏ అవినీతి మచ్చలేదని బీజేపీపై దీక్ష చేస్తారా? జమ్మూకశ్మీర్​ పాకిస్థాన్​ భాగంలో వెళ్లకుండా ఆర్టికల్​ 370ని కాంగ్రెస్​ రద్దు చేయలేకపోయింది. అదే బీజేపీ 370 ఆర్టికల్​ను రద్దు చేసినందుకు దీక్ష చేస్తారా ? మరే దీని కోసం దీక్ష చేస్తారు ?.'- బండి సంజయ్​, బీజేపీ అభ్యర్థి

దేశాన్ని 4 ముక్కలు చేసి విభజించిన మూర్ఖత్వపు పార్టీ కాంగ్రెస్‌ : బండి సంజయ్​

కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్, కేటీఆర్​తో దోస్తాని - ఇద్దరికి నన్ను ఓడించాలే అని ఉంటది : బండి సంజయ్ - Lok Sabha Elections 2024

అధికారం లేక కేసీఆర్‌ కుటుంబం బతకలేకపోతోంది: బండి సంజయ్ - BJP MP Bandi Sanjay Fires on KCR

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.