ETV Bharat / politics

'దేశంలోనే అతి పెద్ద విగ్రహానికి పూలమాలలు వేయకుండా అంబేడ్కర్​ను అవమానించారు' - Balka Suman Fires On CM Revanth - BALKA SUMAN FIRES ON CM REVANTH

Balka Suman Fires On CM Revanth : అంబేడ్కర్​ జయంతి రోజున దేశంలోనే అతిపెద్ద బాబాసాహెబ్​ విగ్రహానికి పూలమాలలు వేయకుండా సీఎం రేవంత్​ రెడ్డి అవమానించారని బీఆర్​ఎస్ నేత బాల్క సుమన్​ ఆరోపించారు. రేవంత్​ రెడ్డికి దళితుల పట్ల ఉన్న చిన్నచూపునకు ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు.

Balka Suman Fires On CM Revanth
Balka Suman Fires On CM Revanth
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 7:53 PM IST

Balka Suman Fires On CM Revanth : బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​పై ఉన్న అక్కసుతో సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించినట్టు కనిపిస్తోందని బీఆర్ఎస్​ నేత బాల్క సుమన్ ఆరోపించారు. అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేయలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి దళితులపట్ల ఉన్న చిన్నచూపునకు ఈ ఘటనే నిదర్శనమని అన్నారు.

Balka Suman Comments On Modi : ఈ విషయంపై సీఎం తక్షణమే క్షమాపణలు చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోక్​సభ ఎన్నికలపైనా స్పందించారు. మోదీ సహకారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Election) రేవంత్ గెలిచారన్న ఆయన ఇప్పుడు లోక్​సభలో మోదీకి సీఎం సాయం చేస్తున్నారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే లోక్​సభ ఎన్నికల(Lok Sabha Polls) బరిలో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టారని వ్యాఖ్యానించారు. మోదీ పదేళ్ల(Modi Govt) పాలనలో రాష్ట్రానికి, దేశానికి ఒరిగిందేమీలేదన్న బాల్క సుమన్ మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు.

కేసీఆర్​ను వేధించేందుకే కవితను అరెస్టు చేయించారు : దక్షిణాదిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ మోదీని ప్రశ్నిస్తున్న కేసీఆర్​ను వేధించేందుకే, కవితపై కేసులు పెట్టి బీజేపీ అరెస్టులు చేయించిందని బీఆర్​ఎస్​ నేత బాల్క సుమన్ ఆరోపించారు. మోదీతో జోడీ కట్టకపోతే ఈడీ, సీబీఐలు వస్తాయని గతంలో కర్ణాటక మొదలు అనేక చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయని బాల్క అన్నారు. లిక్కర్​ స్కాంలో ఉన్న వారిని ఎంపీగా ఏపీలో బీజేపీ నిలబెట్టిందని ఆయన దుయ్యబట్టారు. ఆ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్​గా రూ.కోట్లు ఇచ్చిన శరత్​ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చిందని మండిపడ్డారు.

సీఎం, సీఎస్​లపై గవర్నర్​ తగు చర్యలు తీసుకోవాలి : మరో వైపు ఇదే అంశంపై బీఆర్​ఎస్ నేత దాసోజు శ్రవణ్​ "ఎక్స్'​ వేదికగా స్పందించారు. ప్రతి రాజకీయ ర్యాలీలో సీఎం రేవంత్ సహా అధికార పార్టీ నాయకులందరూ(Leaders) పెద్ద పెద్ద క్రేన్లతో పూలమాలలు వేయించుకుంటున్నారన్న ఆయన అంబేడ్కర్​ విగ్రహానికి మాత్రం కనీసం ఒక్క పూలమాల వేయలేదని మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వం తరపున సీఎం, సీఎస్​ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ(Constitution) నిర్మాతకు జరిగిన అవమానాన్ని గుర్తించి సీఎం, సీఎస్​లపై గవర్నర్ తగు చర్యలు తీసుకోవాలన్నారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీతో జతకట్టడం ఖాయం : బాల్క సుమన్​

'నాడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకం.. నేడు తెలంగాణ ఆడబిడ్డనంటూ నినాదం'

'అసత్య ఆరోపణలతో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.