ETV Bharat / politics

బీజేపీకి బాబు మోహన్ గుడ్ ​బై - రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన - బీజేపీకి బాబు మోహన్ రాజీనామా

Babu Mohan Resigns to BJP : భారతీయ జనతా పార్టీకి మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్ రాజీనామా చేశారు. పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, పొమ్మనకుండా పొగ పెడుతున్నారని మండిపడ్డారు.

Babu Mohan Quits from BJP
Babu Mohan Resigns to BJP Party
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 4:05 PM IST

బీజేపీకి బాబుమోహన్ గుడ్​బై- రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

Babu Mohan Resigns From BJP : ప్రముఖ సినీనటుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్(Babu Mohan) బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ(BJP) పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, పొమ్మనకుండా పొగ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలలో తిరిగి ప్రచారం చేశానని బాబుమోహన్ తెలిపారు. పార్టీ గెలుపునకు ఎంతో శ్రమించానని చెప్పారు. పార్టీలో ఏబీసీడీ సెక్షన్లుగా నాయకులను విభజించి అత్యంత అవమానకరంగా తనను డీ క్యాటగిరిగా నిర్ణయించడం సమంజసం కాదన్నారు. తనను డీ కేటగిరీ కింద నిర్ణయించడానికి రాష్ట్ర నాయకులకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు.

"నేను బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. పార్టీలో తగిన గౌరవం ఇవ్వడం లేదు. పార్టీ బలోపేతానికి ఎంతగానో శ్రమించినప్పటికీ పార్టీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రనేతలను ఏబీసీడీ క్యాటగిరీలుగా విభజించి, నన్ను డీ కేటగిరీలో చేర్చారు. పార్టీలో పొమ్మనలేక పొగబెడుతున్నారు. వరంగల్ ఎంపీగా ప్రజలకు సేవలందిచాలని నిర్ణయించుకున్నాను". - బాబు మోహన్, మాజీమంత్రి, సీనినటుడు

తనను అవమానించడానికే రాష్ట్ర బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోందని బాబు మోహన్ తెలిపారు. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతూ ఫోన్ సైతం ఎత్తడం లేదని తెలిపారు. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు బాబు మోహన్ స్పష్టం చేశారు.

తెలంగాణలో 10 పార్లమెంట్ సీట్లు 35% ఓట్లతో ఘన విజయం సాధిస్తాం : లక్ష్మణ్

Babu Mohan Political Career : బాబు మోహన్ రాజకీయ జీవితం తెలుగుదేశంలో పార్టీలో ప్రారంభమైంది. మొదటిసారిగా టీడీపీ నుంచి 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తెలుగుదేశం హయాంలో సాంఘిక, సంక్షేమ మంత్రిగా పని చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి 2004, 2014లో అందోల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహాపై విజయం సాధించారు.

2018లో బీఆర్ఎస్ నుంటి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి పోటీచేసి బీఆర్​ఎస్ అభ్యర్థి క్రాంతికుమార్ చేతిలో ఓడిపోయారు. అనంతరం 2023లో బీజేపీ నుంచి మరోమారు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో పరాజయం పాలయ్యారు.

'లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం పని చేస్తాం - వాళ్లు అధికారంలోకి వస్తే దేశానికే విపత్తు'

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం - ఆ మూడు స్థానాలు సిట్టింగులకే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.