AP Government Trying to Get Debts : ఏపీ ప్రభుత్వం గతంలోనే బటన్ నొక్కిన కొన్ని పథకాలకు(AP Schemes) ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు పడలేదు. ప్రభుత్వ ఉద్యోగులకూ భారీగా బకాయిలున్నాయి. పోలింగ్ సమీపించే వేళ ఆ సొమ్ములు ఏదోలా చెల్లించి ఆ ప్రభావం లబ్ధిదారులపై ఉండేలా వైఎస్సాఆర్సీపీ(YSRCP) పెద్దలు వేస్తున్న ఎత్తుగడలకు అనుగుణంగా అధికారులు అప్పుల సేకరణలో నిమగ్నమయ్యారు.
మే 13న ఏపీ రాష్ట్రంలో పోలింగ్ జరగనుండగా, ఆ లోపే రూ.16 వేల కోట్ల రుణాలు(AP Debts) తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలలో తొలి మంగళవారం ఏప్రిల్ 2న ప్రభుత్వం రూ.4వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది. 8న మరో రూ.3వేల కోట్లు తీసుకోవాలని అనుకున్నప్పటికీ, ఇందుకు కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. ఆర్థిక శాఖ అధికారులు కొందరు దిల్లీ వెళ్లి వచ్చే మంగళవారం నాటికైనా రుణ అనుమతులు సాధించేలా ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 16, ఏప్రిల్ 30 తేదీల్లో రిజర్వు బ్యాంకు(RBI) నిర్వహించే వేలంలో పాల్గొని మరో రూ.9వేల కోట్ల అప్పు పుట్టించాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది.
వామ్మో పది లక్షల కోట్లా! - ఏపీలోకి అడుగు పెట్టాలంటేనే భయపడేలా రాష్ట్ర అప్పులు
నికర రుణ పరిమితి ఉన్న నో కాంప్రమైజ్ : ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఎంత మేర రుణం తీసుకోవచ్చో ‘నికర రుణ పరిమితి(Net Borrowing Limit)’ని కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశిస్తుంది. కేంద్రం ఏటా ఆర్థిక సంవత్సరం చివర్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు వివరాలు తీసుకొని, తదుపరి ఏడాది రాష్ట్ర నికర ఉత్పత్తి విలువను లెక్కిస్తుంది. దాని ఆధారంగా ఆ ఏడాది ఎంత రుణం తీసుకునేందుకు అవకాశముందో ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా లెక్కించి, నికర రుణ పరిమితిని తేలుస్తుంది. ఆ మేరకు మొదటి 9 నెలలకే తొలుత అనుమతులు ఇస్తుంది. అనుమతించిన మొత్తం అప్పును ఒకే నెలలోనో, కొన్ని నెలల్లోనో తీసుకోవడానికి వీల్లేదు. తొమ్మిది నెలల పాటు సగటున ప్రతినెలా ఇంత మొత్తం చొప్పున అప్పు తెచ్చుకోవచ్చు. అయితే, నెలవారీ పరిమితిని మాత్రం కేంద్రం నిర్దేశించలేదు.
Andhra Pradesh Debt Details : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రూ.4వేల కోట్ల అప్పులకు కేంద్రం నుంచి అడ్‌హక్ అనుమతులు మాత్రమే లభించాయి. రాష్ట్ర ప్రభుత్వ నికర రుణ పరిమితి తేల్చేలోగా ఈ మొత్తం అప్పు తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ తాత్కాలిక వెసులుబాటు కల్పించింది. ఈ నెలలో మరిన్ని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ రాష్ట్ర అధికారులు నికర రుణ పరిమితిని తేల్చడంపై కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Andhra Pradesh Debt in 2023-2024 : 2023-24లో మొత్తంగా బహిరంగ మార్కెట్ రుణాలు రూ.68,400 కోట్లు తీసుకున్నారు. అంటే నెలకు సగటున రూ.5,700 కోట్లు. ప్రస్తుత ఏడాదికి నికర బహిరంగ మార్కెట్ రుణ పరిమితి రూ.72వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేసినా, సగటున నెలకు రూ.6వేల కోట్లు మాత్రమే సేకరించాలి. కానీ, ఈ ప్రభుత్వ పాలన ముగిసిపోతున్న తరుణంలో ఆ పరిమితులన్నీ తోసిరాజని వీలైనన్ని అప్పులు చేసి లబ్ధిదారులకు, అనుయాయుల బిల్లుల చెల్లింపులకు వెచ్చించాలనుకోవడం ఎన్నికల(AP Election 2024) ఎత్తుగడగా తెలుస్తోంది.
"రాబడి పెరగట్లేదు.. అప్పులు తీరట్లేదు".. కాగ్ హెచ్చరిస్తున్నా దిద్దుబాటు చర్యల్లేవు