Lok Sabha Elections 2024 : వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్‌లో గెలిచి చరిత్ర సృష్టిస్తారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరిగిన బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనానికి హాజరయ్యారు.
మోదీ హయాంలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి : జేపీ నడ్డా - JP Nadda Election Campaign
ఈసందర్భంగా మాట్లాడుతూ బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయని అన్నామలై పేర్కొన్నారు. బండి సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసి లాఠీలు, కేసులకు భయపడకుండా జైలుకు వెళ్లిన చరిత్ర సంజయ్‌కే సొంతమన్నారు. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనన్నారు. మొత్తం పోలైన ఓట్లలో 60 శాతం ఓట్లు బండి సంజయ్‌కే పడేలా ఇంటింటికీ తిరిగి గెలిపించాలని యువతకు సూచించారు.
అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అన్నామలై పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వంద రోజుల్లో ఆరు హామీలు అమలు చేస్తామన్నామని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ చెడ్డపేరు వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ రిజర్వేషన్లను రద్దుకు వ్యతిరేకమని, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను యథాతథంగానే అమలు చేయనున్నట్లు తెలిపారు.
మోదీని బడాబాయ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారని, గుజరాత్ మోడల్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారని అన్నామలై గుర్తుచేశారు. మోదీ పనీతీరును ప్రశంసించిన రేవంత్‌రెడ్డి, ఎన్నికలు రాగానే మోదీపై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారన్నారు. రేవంత్ రెడ్డి ప్రచార సమయంలో గాడిద గుడ్డునే పట్టుకుని తిరుగుతున్నారని, అబద్ధాలు చెప్పిన వారిని గాడిదపై కూర్చోబెడతామని దుయ్యబట్టారు.
"కాంగ్రెస్ పార్టీ, బీజేపీపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తోంది. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను బీజేపీ తొలగించదు. రిజర్వేషన్లపై మాట్లాడిన అమిత్ షా వీడియోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మార్ఫింగ్ చేశారు. అందులో ఉన్నది వాస్తవం కాదు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. మెజార్టీ స్థానాల్లో సీట్లను కైవసం చేసుకుంటుంది". - అన్నామలై, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
అప్పులు చేసి పథకాలు అమలు చేయడం గొప్ప కాదు : ఎంపీ అర్వింద్ - MP ARVIND IN CHAI PE CHARCHA TODAY