ETV Bharat / politics

రాష్ట్రంలో బీజేపీకి 12 కంటే ఎక్కువ స్థానాలు రావడం ఖాయం : అమిత్‌షా - Amit Shah in Hyderabad

Amit Shah Telangana Tour : వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్​షా అన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ బీజేపీ వెళ్లాలని, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Amith Shah Telangana Tour
BJP Election Campaign Strategy In Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 3:02 PM IST

Updated : Mar 12, 2024, 3:49 PM IST

Amit Shah Telangana Tour : రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్‌ మీడియా(Social Media) ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంటామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ కమలం పార్టీని తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

మోదీ, మోదీ అని యువత నినదిస్తోందన్న అమిత్​ షా, మళ్లీ మోదీకే పట్టం కడతామని మహిళలంతా అంటున్నారని తెలిపారు. ఈసారి తమకు 400 సీట్లు దాటతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అందులోనూ తెలంగాణ నుంచి 12కు పైగా ఉండాలని కోరారు. తెలంగాణ ప్రజల మద్దతుతో దిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తామని షా ధీమా వ్యక్తం చేశారు. అవినీతిరహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా, మోదీ(PM Modi) పదేళ్లుగా సుస్థిర పరిపాలన అందించారని కొనియాడారు.

అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే - బిజీబిజీగా గడపనున్న కేంద్రమంత్రి

BJP Election Campaign Strategy in Telangana : బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మోదీ మరోసారి ప్రధానిగా వస్తే, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా(Economic System) భారత్​ను తీర్చిదిద్దుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ఇండియా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్న హోంమంత్రి, ఈ పదేళ్లలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.

దేశ ప్రజలు 500 ఏళ్లుగా ఎదురుచూసిన రామమందిరాన్ని నిర్మించామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​, మజ్లిస్‌ ఒక్కటేనన్న అమిత్ షా, మజ్లిస్‌ అజెండాతోనే హస్తం, గులాబీ పార్టీలు(BRS Party) పనిచేస్తాయని దుయ్యబట్టారు. ఆ మూడు పార్టీలు వారసత్వ పార్టీలేనని విమర్శించారు. యురి ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. పది రోజుల్లోనే పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్‌ చేసి ముష్కరులను మట్టుబెట్టామని, మన సైనికులపై దాడిని మర్చిపోయేందుకు ఇది మన్మోహన్‌ ప్రభుత్వం కాదని అమిత్​ షా తెలిపారు.

ఆసక్తిరేపుతున్న ఆదిలాబాద్‌ ఎంపీ సీటు - జోరందుకున్న రాజకీయ వలసలు

లోక్​సభ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ నజర్​- అభ్యర్థుల రెండో లిస్ట్ రెడీ!

Last Updated : Mar 12, 2024, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.