ETV Bharat / politics

తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్​ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం - Abhishek Singhvi elect Rajya Sabha

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 4:20 PM IST

Updated : Aug 27, 2024, 7:01 PM IST

Abhishek Manu Singhvi Elected to Rajya Sabha : రాజ్యసభకు అభిషేక్​ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రెండు నామినేషన్లు రాగా స్వతంత్ర అభ్యర్థిని ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో నామినేషన్​ తిరస్కరణకు గురైంది. దీంతో అభిషేక్​ మను సింఘ్వీ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Abhishek Manu Singhvi elected to Rajya Sabha from Telangana
Abhishek Manu Singhvi elected to Rajya Sabha from Telangana (ETV Bharat)

Abhishek Manu Singhvi Elected to Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్​ మనుసింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ అభ్యర్థిత్వానికి రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో కాంగ్రెస్​ నుంచి అభిషేక్​ మను సింఘ్వీ నామినేషన్​ వేయగా, రెండోది స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్​ నామినేషన్​ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో పద్మరాజన్​ నామినేషన్​ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో అభిషేక్​ మను సింఘ్వీ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నిక అయ్యారు.​ అభిషేక్​ మను సింఘ్వీ తరఫున కాంగ్రెస్​ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్​ ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్​లో అభిషేక్​ మను సింఘ్వీ ప్రస్థానం : అభిషేక్​ సింఘ్వీ సుధీర్ఘకాలంగా కాంగ్రెస్​ పార్టీకి సేవలందిస్తున్నారు. 2001 నుంచి కాంగ్రెస్​ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. రెండు దఫాలు రాజ్యసభ సభ్యుడు అయ్యాయి. అవి 2006, 2018లో రెండుసార్లు ఆ హోదాను పొందారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్​ప్రదేశ్​ నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఆయనను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. కానీ తెలంగాణలో రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించారు. కానీ జాతీయ రాజకీయాల్లో సింఘ్వీ సేవలు కాంగ్రెస్​కు కీలకమైనందున ఆయనకే అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆయన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.

ఎవరూ నామినేషన్​ వేయకపోవడంతో సింఘ్వీ ఏకగ్రీవం : తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన కాంగ్రెస్​ సీనియర్​ నేత అభిషేక్​ మను సింఘ్వీ ఆగస్టు 19వ తేదీన శానససభలో నామినేషన్​ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. కేశవరావు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీకి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్​ ఇచ్చింది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్​ వేసేందుకు గడువు ఇచ్చారు.

అయితే అభిషేక్​ సింఘ్వీతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్​ నామినేషన్​ దాఖలు చేశారు. రెంజు నామినేషన్​ వచ్చినట్లు అయితే ఎన్నిక నిర్వహించాలి. కానీ స్వతంత్ర అభ్యర్థికి ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో సింఘ్వీనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లేకపోతే వచ్చే నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండేది.

రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన అభిషేక్ మను సింఘ్వి - T CONGRESS RAJYA SABHA NOMINATION

అభిషేక్‌ సింఘ్వీ అభ్యర్థిత్వానికి రాష్ట్ర కాంగ్రెస్‌ గ్రీన్‌సిగ్నల్‌

Last Updated : Aug 27, 2024, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.