ETV Bharat / opinion

కేంద్ర పాలిత ప్రాంతాల్లో సత్తా చాటేదెవరో? బీజేపీకి సర్వేలన్నీ జై- కాంగ్రెస్​కు గడ్డు పరిస్థితులు! - Union Territories Of India - UNION TERRITORIES OF INDIA

Union Territories Of India Elections : కేంద్రపాలిత ప్రాంతాల్లో ముందు నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న జాతీయ పార్టీలు మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. దిల్లీలో క్లీన్‌స్వీప్‌ చేసి మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల్లోని 12 స్థానాల్లో ఐదింట నెగ్గిన బీజేపీ ఈసారి మరిన్ని సీట్లు పెంచుకోవాలని యత్నిస్తోంది. సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో 2 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి సత్తా చాటాలని కోరుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లోని పార్టీల బలాబలాలపై ప్రత్యేక కథనం.

Union Territories Of India Elections
Union Territories Of India Elections
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 6:44 AM IST

Union Territories Of India Elections : కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరోసారి సత్తా చాటేందుకు జాతీయ పార్టీలు తమ వ్యూహాలతో సిద్ధమయ్యాయి. యూటీల్లో ముందు నుంచి జాతీయ పార్టీల హవానే కొనసాగుతోంది. గత ఎన్నికల్లో యూటీల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. దిల్లీలో క్లీన్‌స్వీప్‌ చేసిన బీజేపీ మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల్లోని 12 సీట్లుకు గాను ఐదు సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్‌ రెండు సీట్లకే పరిమితమైంది. దిల్లీలో అయితే ఏకంగా ఏడుకు ఏడు సీట్లు గెలుచుకొని బీజేపీ సంపూర్ణ అధిపత్యం ప్రదర్శించింది. మరోసారి అదే జోరు కొనసాగించాలని బీజేపీ తహతహలాడుతోంది. కాంగ్రెస్‌ కూడా యూటీల్లో తిరిగి తమ ఉనికిని నిరూపించుకోవాలని పట్టుదలతో ఉంది.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారి!
కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీని మినహాయిస్తే అతిపెద్ద యూటీ జమ్ముకశ్మీర్‌. ఇక్కడ 5 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో తొలిసారి లోక్‌సభ ఎన్నికల జరగనుండటం వల్ల అందరి దృష్టి నెలకొంది. 2019లో సార్వత్రిక ఎన్నికల జరిగిన కొన్ని నెలలకే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌, లద్ధాఖ్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జమ్ముకశ్మీర్‌లోని 5 లోక్‌సభ స్థానాల్లో మూడు నేషనల్‌ కాన్ఫరెన్స్‌, రెండు బీజేపీ నెగ్గాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం ఇచ్చింది. గత రెండు పర్యాయాల్లో కాంగ్రెస్‌ సున్నాకే పరిమితమైంది.

హస్తం పార్టీ గడ్డు పరిస్థితులు
జమ్ముకశ్మీర్‌లో గత రెండు ఎన్నికల్లో సత్తాచాటిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఇండియా కూటమిలో చేరగా మరో బలమైన పార్టీ పీడీపీ సైతం ఇండియా కూటమితో జట్టు కట్టింది. గతంలో ఇక్కడ చక్రం తిప్పిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ రాజీనామాతో హస్తం పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్, జేకేఎన్​సీ, పీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. జమ్ము ప్రాంతంలోని 2 సీట్లలో కాంగ్రెస్‌కు అవి మద్దతివ్వనున్నాయి. కశ్మీర్‌ లోయలోని 3 సీట్లపై మాత్రం సందిగ్ధత నెలకొనడం వల్ల విడివిడిగా పోటీ చేయనున్నాయి. తమను సంప్రదించకుండానే ఒంటరిగా పోటీ చేస్తామని ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ప్రకటించారని, కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు పోటీచేయడం తప్ప తమ దగ్గర ఇంకో మార్గం లేదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.

చిన్నచిన్న పార్టీలతో ఆజాద్
అటు గులాంనబీ ఆజాద్‌ సొంతంగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ పెట్టి చిన్న చిన్న పార్టీలను కలుపుకుని బరిలోకి దిగుతున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌కు పర్యటకులు పెరగడం, అభివృద్ధి పనులు జరగడం వల్ల విజయంపై బీజేపీ నమ్మకంతో ఉంది. జమ్ముకశ్మీర్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19, 26, మే 7, 13, 20 తేదీల్లో ఐదు దశల్లో పోలింగ్‌ జరగనుంది. లద్ధాఖ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానంలో గత రెండు ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. మరోసారి అక్కడ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తోంది. లద్ధాఖ్‌లో మే20న పోలింగ్‌ జరగనుంది.

ఛండీగఢ్​లో ఇలా!
ఛండీగఢ్‌లో 1999 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ కొట్టిన కాంగ్రెస్‌కు 2014లో బీజేపీ షాకిచ్చింది. ప్రముఖ నటి కిరణ్‌ అనుపమ్‌ ఖేర్‌ 2014, 2019లలో బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆమె స్థానంలో మరొకరికి ఛాన్స్‌ ఇవ్వాలని బీజేపీ చూస్తోంది. అటు కాంగ్రెస్‌ తరఫున మాజీ కేంద్రమంత్రి మనీశ్‌ తివారీ బరిలో నిలిచారు. జూన్‌ 1న ఏడో విడతలో భాగంగా ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. ఛండీగఢ్‌లో కాంగ్రెస్‌ ఆరుసార్లు గెలవగా, బీజేపీ ఐదుసార్లు విజయం సాధించింది.

పుదుచ్చేరిపై బీజేపీ మాస్టర్ ప్లాన్
తమకు పట్టులేని పుదుచ్చేరిలో పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇక్కడ జయకేతనం ఎగురువేసింది. ఇక్కడ బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు. 2014లో ఎన్డీయే భాగస్వామి అయిన ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలిచింది. పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీలైన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, డీఎంకేతో పాటు కాంగ్రెస్‌ హవా కొనసాగేది. కాంగ్రెస్‌ నుంచి విడిపోయి ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన ఎన్‌ రంగస్వామి బీజేపీతో జట్టుకట్టారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లకుగాను ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 10, బీజేపీ 6 స్థానాలను గెలుచుకొని ఎన్డీయే ప్రభుత్వాన్ని నెలకొల్పాయి. రంగస్వామి నిష్కృమణ తర్వాత పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభావం తగ్గిపోయింది. ఏప్రిల్‌ 19న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది.

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో హోరాహోరీ
అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది. ఇక్కడ ఒకసారి కాంగ్రెస్‌ గెలిస్తే మరోసారి బీజేపీ గెలుస్తోంది. 1999 నుంచి ఇదే ఒరవడి కొనసాగుతోంది. 1999 నుంచి ఏ పార్టీ వరుసగా రెండోసారి గెలవలేదు. 2014లో బీజేపీ గెలిస్తే 2019లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆనవాయితీని కొనసాగించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంటే వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. ఏప్రిల్‌ 19న జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరివైపు మెుగ్గు చూపుతారో చూడాలి.

దాద్రానగర్‌ హవేలీ సీటు ఎవరిదో?
దాద్రానగర్‌ హవేలీలో 2021లో జరిగిన ఉపఎన్నికల్లో శివసేన నెగ్గింది. ఇక్కడ అనేక పార్టీల తరఫున పోటీ చేసి ఏకంగా ఏడుసార్లు నెగ్గిన మోహన్‌భాయ్‌ సంజీభాయ్‌ దేల్కర్‌ 2019లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2021లో ఆయన ఆత్మహత్య చేసుకోవడం వల్ల సంజీభాయ్‌ దేల్కర్‌ భార్య కాలాబెన్‌ మోహన్‌ భాయ్‌ దేల్కర్‌ శివసేన తరఫున పోటీ చేసి నెగ్గారు. మే7న జరిగే ఎన్నికల్లో ఈసారి కాలాబెన్‌ బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. డామన్‌ అండ్‌ డయ్యూలోని ఏకైక లోక్‌సభ స్థానాన్ని గత మూడు పర్యాయాలుగా బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఇక్కడ హ్యాట్రిక్‌ కొట్టిన లాలూభాయ్‌ పటేల్‌ను కాదని ఈసారి బీజేపీ కొత్త అభ్యర్థిని బరిలో దింపింది. అటు కాంగ్రెస్‌ గతంలో రెండు సార్లు గెలిచిన దహ్యాభాయ్ వల్లభాయ్ పటేల్‌ను మళ్లీ బరిలోకి దింపింది.

లక్షద్వీప్​పై అందరి ఫోకస్​!
ప్రస్తుతం ఎన్సీపీ చేతిలో ఉన్న లక్షద్వీప్‌ లోక్‌సభ స్థానం ఆ పార్టీ విడిపోయిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో అక్కడ గెలిచిన సిట్టింగ్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గం వైపు ఉన్నారు. ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని బీజేపీతో జట్టు కట్టిన ఎన్సీపీ అజిత్‌ పవార్‌ వర్గం పట్టుదలతో ఉంది. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపథ్యంలో లక్షద్వీప్‌ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టడం, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత పర్యటకులు తాకిడి పెరగడం ఎన్సీపీ అజిత్‌ పవార్‌ వర్గానికి అనుకూలంగా మారే అవకాశం ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.