Pratidhwani On Telangana Budget Allocation 2024-25 : రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 6గ్యారెంటీలు, అభయ హస్తం వంటి ముఖ్యమైన హామీలకు చేతినిండా నిధులు అందుబాటులో ఉండేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దుతోంది. అయితే,అనేక ఆర్థిక ప్రతికూలతలు, సవాళ్ల నేపథ్యంలో సర్కార్ తమ ప్రాధాన్యాలకు అనుగుణంగా నిధులు ఎలా సరిపెట్టనుంది? ఎక్సైజ్, పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా వచ్చే సంప్రదాయ ఆదాయం తోపాటు ఇంకా ఆదాయం పెంచుకునే మార్గాలు ఏంటి? సంక్షేమ పథకాల భారం మోస్తూనే, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యాల సాధనకు బడ్జెట్‌ను ఎలా తీర్చిదిద్దుతుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉంటాయి? మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారెంటీలతో వ్యయసాయం, రైతాంగానికి ఈ బడ్జెట్‌లో ఎలాంటి మద్దతు అవసరం? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్దగా నిధులు కేటాయించలేదన్న అసంతృప్తి నేపథ్యం లో ప్రాధాన్యతారంగాలకు నిధులు ఎలా సరిపెడతారు?
సంక్షేమ రంగాలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం ఏంటి? బడ్జెట్‌లో అది ఎలా ప్రతిబింబించే అవకాశం ఉంది? ప్రభుత్వం రుణమాఫీకి భారీగా నిధులు వెచ్చిస్తోంది. రైతు భరోసాకు పెంచిన మొత్తాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిధుల కొరత రాకూడదంటే ఆర్థికశాఖ ప్లాన్ ఎలా ఉండాలి? హామీల అమలుకు పెద్దఎత్తున నిధులు అవసరమైన పరిస్థితుల్లో సొంత ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం భూముల విలువలు సవరిస్తోంది.
మైనింగ్ ఆదాయం పెంచాలని భావిస్తోంది. ఇలా ఇంకా ఎలాంటి వనరులపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది? రాష్ట్ర ఆదాయం ఇప్పుడున్న దానికంటే 15 శాతం అదనంగా పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్‌లు, జీఎస్టీ విభాగాల్లో ఆదాయవృద్ధికి బడ్జెట్‌లో ఎలాంటి ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది? నిధుల కొరత ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం బడ్జెట్‌ను ఎలా తీర్చిదిద్దవచ్చు? ఇవే అంశాలపై ప్రతిధ్వని.
ఆరు హామీలే తొలి ప్రాధాన్యమంటోన్న ప్రభుత్వం - అమలు దిశగా అధిగమించాల్సిన సవాళ్లేంటి?