ETV Bharat / opinion

ద్రవిడ పార్టీలకు చెక్! తమిళనాడులో మల్టీస్టారర్ బొమ్మ- అందరి టార్గెట్ '2026' - తమిళనాడు రాజకీయాలు

Tamil Nadu Politics 2024 : రెండు పార్టీల కేంద్రంగానే రాజకీయాలు నడిచే తమిళనాడులో పరిస్థితులు మారిపోతున్నాయి. ద్రవిడ పార్టీలను ఎదురించేందుకు కొత్త శక్తులు సిద్ధమవుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే కాకుండా ఈసారి పోరు బహుముఖంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు తమిళనాడులో ఇప్పుడు ఏం జరుగుతోంది? విజయ్ పార్టీ ప్రభావం ఎంత? కొత్త పార్టీతో ఎవరి ఓట్లు చీలుతాయి?

Tamil Nadu Politics 2024
Tamil Nadu Politics 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 5:44 PM IST

Updated : Feb 7, 2024, 6:03 PM IST

  • డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే
  • రెండు పార్టీల మధ్యే సీఎం కుర్చీ
  • తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయం ఇదే
  • కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది!
  • డ్యుయల్ హెడర్ కాస్తా మల్టీస్టారర్ బొమ్మగా మారుతోంది!
  • సంప్రదాయ ద్రవిడ పార్టీలకు తోడు బీజేపీ దూసుకొస్తోంది.
  • మరోవైపు, కొత్త పార్టీలూ సై అంటున్నాయి.

Tamil Nadu Politics 2024 : లోక్​సభ ఎన్నికలకు గట్టిగా మూడు నెలలు కూడా లేదు. అప్పుడే తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఓ వైపు కొత్త పార్టీల సందడి నెలకొంటే మరోవైపు, రాష్ట్రంలో నిలదొక్కుకోవాలని మరికొన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అధికార డీఎంకేను ఢీకొట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. అయితే, లోక్​సభ ఎన్నికల కంటే 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపైనే ఈ పార్టీలు దృష్టిసారిస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే అధికారంలో ఉంది. 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో సొంతంగా 132 మంది సభ్యులతో బలంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు డీఎంకేకు మద్దతిస్తున్నాయి. విపక్ష అన్నాడీఎంకేకు 62 మంది సభ్యులు ఉన్నారు. అయితే, అన్నాడీఎంకే వర్గపోరుతో సతమతమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. డీఎంకేను ధిక్కరించే బలమైన శక్తి అవసరం ఏర్పడుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పలు పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

TAMIL NADU POLITICS
తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్

మూడో కూటమికి బీజేపీ ఏర్పాట్లు?
ఎన్నికల్లో పెద్దగా రాణించకపోయినప్పటికీ తమిళనాడులో తన సత్తా చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అన్నాడీఎంకేతో స్నేహం చెడినప్పటికీ కొత్తగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దివంగత విజయకాంత్ స్థాపించిన దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగం(డీఎండీకే), టీటీవీ దినకరణ్​కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) వంటి పార్టీలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. జీకే వాసన్​కు చెందిన తమిళ మానిలా కాంగ్రెస్, బహిష్కృత అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం వర్గం సహా ఇంకొన్ని చిన్న పార్టీలను సైతం కలుపుకునేందుకు యత్నిస్తోంది. పొత్తు విషయాలపై దృష్టిసారించేందుకు బీజేపీ జాతీయ నేతలు త్వరలోనే తమిళనాడులో పర్యటించనున్నట్లు సమాచారం.

అయితే, చిన్న పార్టీలన్నింటితో మూడో కూటమి ఏర్పాటు చేయడం వల్ల వచ్చే లాభం తక్కువే. బదులుగా అన్నా డీఎంకేతో కలిస్తేనే 2026 ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్న మాట. బీజేపీ కూడా అన్నా డీఎంకేతో కలిసే అవకాశాన్ని పూర్తిగా పక్కనబెట్టినట్లు లేదు. కూటమిలో ఉన్నప్పుడు అన్నాడీఎంకే నేతలపై తరచూ విమర్శలు గుప్పించిన అన్నామలై- వారు దూరమైన తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అన్నాడీఎంకేతో కలవాలని కొందరు బీజేపీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.

బీజేపీకి 15 శాతం ఓట్లు!
అయితే, బీజేపీని బలోపేతం చేయడమే తమ ప్రస్తుత లక్ష్యమని, కూటములు కాదని అన్నామలై చెబుతున్నారు. రాష్ట్రంలో తాను చేపట్టిన 'ఎన్ మన్ ఎన్ మక్కల్ యాత్ర'కు మంచి స్పందన వస్తుండటాన్ని చూసి అన్నామలై కాన్ఫిడెన్స్​తో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నాడీఎంకే విడిపోయిన తర్వాత కూడా తమిళనాడులో బీజేపీకి ఏ మాత్రం మద్దతు తగ్గలేదని అంటున్నాయి. దక్షిణ తమిళనాడు, కొంగు నాడు ప్రాంతాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందని బీజేపీ చెబుతోంది. మోదీ జనాకర్షణతో 3 నుంచి 4 శాతం ఓట్లు పెరుగుతాయని, బీజేపీ 15 శాతం ఓట్లు దక్కించుకుంటుందని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, తన బలమైన అస్త్రాలను కూడా తమిళనాడులో ప్రయోగిస్తోంది బీజేపీ. రామ మందిరం అంశంతో ప్రజల్లోకి వెళ్తోంది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయాల్లో లైవ్ టెలికాస్ట్​ను డీఎంకే అడ్డుకోవడానికి ప్రయత్నించడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. అయితే, ద్రవిడ పార్టీలను తట్టుకొని ముందుకెళ్లాలంటే స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం, కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు చెందిన దాదాపు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. రాష్ట్రంలో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొని నిరంతరం శ్రమిస్తున్న బీజేపీకి ఇది బలం చేకూర్చేదే.

"పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలంతా రాష్ట్ర బీజేపీకి తమ అనుభవాన్ని తీసుకొస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నారు. కాబట్టి వీరంతా ఆయనకు మరింత బలం చేకూరుస్తారు. తమిళనాడు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో వారు (డీఎంకే పార్టీని ఉద్దేశించి) గమనిస్తూనే ఉంటున్నారని అనుకుంటున్నా."
-అన్నామలై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు

అన్నాడీఎంకే పరిస్థితి ఏంటి?
జయలలిత మరణం, రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, పార్టీలో వర్గపోరు వంటి సమస్యలతో సతమతమైన అన్నాడీఎంకే ఇప్పుడిప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది. అన్నాడీఎంకే అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్రంలో వీలైనన్ని చిన్న పార్టీలతో జట్టుకట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో పోటీ పడుతూ వివిధ పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే), సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్​డీపీఐ)లతో చర్చలు జరుపుతున్నారు. డీఎండీకేతోనూ చర్చలు జరుపుతున్నప్పటికీ ఆ పార్టీ ఎన్​డీఏలో చేరేందుకే మొగ్గుచూపుతోందని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
టీటీవీ దినకరణ్ ఏఎంఎంకే, టీఆర్ పారివేందర్​కు చెందిన ఇందియ జననాయగ కట్చి (ఐజేకే), కే కృష్ణస్వామి నేతృత్వంలోని పుతియా తమిళగమ్​ సైతం ఎన్​డీఏ వైపే చూస్తున్నట్లు సమాచారం.

TAMIL NADU POLITICS
పళనిస్వామి, పన్నీర్ సెల్వం

నటుల కొత్త రోల్
ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ వచ్చి చేరింది. ఆ రాష్ట్రంలో విశేష అభిమానగణాన్ని సంపాదించుకొని 'దళపతి'గా పేరుగాంచిన విజయ్ జోసెఫ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ ప్రకటించారు. ప్రస్తుత లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని, 2026 అసెంబ్లీ ఎన్నికలే తన టార్గెట్ అని స్పష్టం చేశారు. పార్టీ గుర్తు, జెండా, సిద్ధాంతాలు, పాలసీల గురించి ఇంకా స్పష్టత రానప్పటికీ విద్య, వైద్యం, అవినీతి నిర్మూలన కోసం విజయ్ పార్టీ పని చేసే అవకాశం ఉంది.

విజయ్​తో అందరికీ నష్టమేనా!
తమిళనాడు రాజకీయాల్లో సినీ నటులది ప్రత్యేక అధ్యాయం. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి అప్రతిహత విజయాలు సాధించినవారే కాకుండా ఘోర పరాభవాలను ఎదుర్కొన్న వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయాల్లో ఏమేరకు ప్రభావం చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశంతో ద్రవిడ పార్టీలకే పెద్దగా నష్టం ఉండేలా కనిపిస్తోందని తెలుస్తోంది. సాధారణంగా విజయ్ ఆలోచనలు డీఎంకే సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటాయని, కాబట్టి వారి ఓట్లు విజయ్ చీల్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. స్వతహాగా మైనారిటీ అయినందున వారి ఓట్లు కూడా తనవైపు తిప్పుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

విజయ్ అభిమానుల్లో ఎక్కువగా యువతే ఉంటారు. ఈ నేపథ్యంలో యువతలో క్రేజ్ సంపాదించిన తమిళ జాతీయవాద నేత సీమన్, ఆయనకు చెందిన నామ్ తమిళర్ కట్చి(ఎన్​టీకే)కి నష్టం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అన్నామలై వాక్చాతుర్యంతో బీజేపీ సంపాదించిన యువ ఓటర్ బేస్​ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున దేనిపైనా పూర్తి స్పష్టతకు రాలేమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని పార్టీలు మాత్రం విజయ్ వల్ల తమపై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నాయి.

"2011లో విజయ్ అన్నాడీఎంకే కూటమికి మద్దతు ఇచ్చారు. 2026లో ఎందుకు మాకు మద్దతు ఇవ్వకుండా ఉంటారు? టైమ్​ను బట్టి ప్రజల మూడ్ మారుతూ ఉంటుంది. విజయ్ రాజకీయాల్లోకి రావడం వల్ల అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఎలాంటి నష్టం లేదు. కానీ, కమల్ హాసన్​లా మారకుండా ఆయన జాగ్రత్తగా ఉండాలి. కమల్ హాసన్ కూడా దేశాన్నే సంస్కరిస్తామని చెబుతూ రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడేమో ఒక్క ఎంపీ టికెట్ కోసం ఓ పార్టీని అట్టిపెట్టుకొని పని చేస్తున్నారు."
-సెల్లూర్ కే రాజు, అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి

మరోవైపు, విజయ్​ను బీజేపీ వదిలిన బాణం అంటూ కొందరు అన్నాడీఎంకే నేతలు ఎద్దేవా చేస్తున్నారు. బీజేపీ ప్రమేయంతోనే విజయ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపిస్తున్నారు. 'విజయ్​కు దశాబ్ద కాలం నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఇప్పటికి ఆయన బయటపడ్డారు. మా అధినేత (పళనిస్వామి) బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాతే ఈ పరిణామాలు జరుగుతున్నాయి. గతంలో బీజేపీ రజనీకాంత్​తో ప్రయోగాలు చేద్దామని భావించింది. రాజకీయాల్లోకి రావాలని బలవంతం చేసింది. కానీ ఎలాగో ఆయన తప్పించుకున్నారు. ఇప్పుడు విజయ్​ను రంగంలోకి దించింది. తమిళనాడులో బలపడేందుకు బీజేపీకి ఓ పెద్ద మూవీ స్టార్ అవసరం' అని అన్నాడీఎంకే లీడర్ కోవై సత్యం ఆరోపించారు.

బలంగా డీఎంకే కూటమి
అటు, అధికార డీఎంకే తన కూటమిని ఏకతాటిపై నడిపిస్తోంది. కాంగ్రెస్, విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే), మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర గళగం (ఎండీఎంకే), వామపక్షాలు సహా వివిధ పార్టీలతో పొత్తు కొనసాగిస్తోంది. మరోవైపు, కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అడుగులు ఎటువైపు పడతాయో తెలియాల్సి ఉంది. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ కూటములతో పాటు విజయ్ 'టీవీకే' వంటి పార్టీలు బరిలో ఉన్న నేపథ్యంలో 2026 ఎన్నికల్లో బహుముఖ పోరు తప్పేలా లేదు.

ఇండియాకు మరో షాక్​! కూటమి నుంచి RLD ఔట్​! బీజేపీతో చర్చలు

జేడీయూ చేరిక NDAకు లాభమేనా? 40 సీట్లు క్లీన్​స్వీప్​ చేస్తారా?

Last Updated : Feb 7, 2024, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.