ETV Bharat / opinion

చట్టసభల సభ్యులపై ఏళ్లకేళ్లు కోర్టుల్లో కేసుల విచారణలు - మరి తేలేదెన్నడు? - CRIMINAL CASES ON POLITICIANS - CRIMINAL CASES ON POLITICIANS

Prathidwani on Politicians with Criminal Cases : దేశ రాజకీయాల్లో ఏటికేడు నేరచరితులైన నేతల సమస్య తీవ్రమవుతోంది. కటకటాల్లో మగ్గాల్సిన వాళ్లు ప్రజలను కాల్చుకు తింటున్నారు. కేసుల విచారణలో జాప్యంతో న్యాయవ్యవస్థకు అప్రతిష్ఠ పాలవుతోంది. మరి ఏటికేడు పెరుగుతున్న కేసులు దేనికి సంకేతం? దీనికి ఎక్కడ పరిష్కారం? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని.

CRIMINAL CASES ON POLITICIANS
CRIMINAL CASES ON POLITICIANS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 10:22 AM IST

Prathidwani on Political Leaders Involved in Criminal Offenses : అభియోగాలు రుజువైతే జీవితాంతం కటకటాల్లో మగ్గాల్సిన వాళ్లు పాలకులై ప్రజల్ని కాల్చుకు తింటున్నారు. చట్టసభల సభ్యులపై కోర్టుల్లో కేసుల విచారణలు ఏళ్లకేళ్లు కొనసాగడం వల్ల దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీరని నష్టం వాటిల్లుతోంది. సుప్రీంకోర్టు ఎంత చెబుతున్నా, ఎంత ప్రక్షాళన చేయాలని చూస్తున్నా, రాజకీయ నాయకులపై కోర్టుల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసులు, ఏళ్ల తరబడి విచారణల పేరుతో జరుగుతున్న తాత్సారం వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట కూడా మసకబారుతోంది.

Criminal Cases on Politicians : 40 శాతం పైగా ఎంపీలు నేరచరితులేనంటున్న నివేదికలు చెబుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5,000లకు పైగా కేసులు ఉన్నాయి. "నీకిది-నాకది" పద్ధతిలో రాజకీయ నాయకుల అక్రమాలకు పాల్పడుతున్నారు.వేలకోట్లు దోచేసి, పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులున్నా, దశాబ్దానికి పైగా బెయిల్‌పై దర్జాగా తిరుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నవారు, ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు. దశాబ్దకాలం దాటిన జగన్ అక్రమాస్తులపై కేసుల విచారణ. నిజానిజాలు నిగ్గుతేల్చడంలో ఎందుకింత జాప్యం? ఇలాంటి కేసుల్లో ఏడాదిలో విచారణ పూర్తిచేయాలన్న సుప్రీం చెబుతోంది. మరి ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు, చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏటికేడు పెరుగుతున్న కేసులు దేనికి సంకేతం? దీనికి ఎక్కడ పరిష్కారం? ఇదే నేటి ప్రతిధ్వని.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.