Pratidwani : పల్లె సీమలకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. గ్రామాల్లో వసతుల కల్పన, సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 23వ తేదీన ఒకటే రోజు రాష్ట్రం మొత్తం 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖమంత్రి పవన్ కల్యాణ్. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై అక్కడే చర్చించి, అక్కడే కేటాయింపులు చేసేలా అధికారులను సమాయత్తం చేస్తున్నారు. మరి, అయిదేళ్లుగా రాష్ట్రంలో పంచాయతీలు, స్థానిక సంస్థలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవ, కొత్త ప్రణాళికలతో గ్రామ స్వరాజ్యం దిశగా ఎలాంటి అడుగులు పడనున్నాయి? 100 రోజుల్లో పల్లె ప్రగతికోసం నిర్థేశించుకున్న అజెండా ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాష్ట్రంలో స్థానిక సంస్థల సమస్యలు, గత ప్రభుత్వంలో పంచాయతీలకు జరిగిన అన్యాయంపై ఎన్నో ప్రత్యక్ష పోరాటాలు చేసిన చిలకలపూడి పాపారావు. మరొకరు ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ సెంటర్ విభాగాధిపతి, గ్రామీణాభివృద్ధిరంగంలో ఎంతోకాలంగా పరిశోధనలు చేస్తున్న నిపుణులు. అస్సోం, దిల్లీ సెంట్రల్ యూనివర్సిటీల్లో కూడా పనిచేసిన విశేష అనుభవజ్ఞులు ప్రొ. శ్రీపతి రాముడు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి పంచాయతీల్లో గ్రామ సభలు: పవన్ - Deputy CM Pawan Video Conference
గడిచిన 5సంవత్సరాలుగా పంచాయతీలు, స్థానిక సంస్థలు, సర్పంచ్‌ల సమస్యలపై ఎన్నో ప్రత్యక్ష పోరాటాలు జరిగాయి. అప్పటికి ఇప్పటికీ వచ్చిన తేడా ఏమిటి? ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే ఎన్ని విధాలుగా ప్రయోజనాలు పొంద వచ్చు. స్థానిక సంస్థల అభివృద్ధి ముఖచిత్రాన్ని ఎలా మార్చవచ్చు? అయిదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఎప్పుడైనా ఇలా గ్రామసభలు నిర్వహించడం కానీ, గ్రామాల అవసరాలు ఏమిటో గ్రామస్థాయిలో తెలుసుకోవడం, పరిష్కారాలు చూపడం జరిగిందా?
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తే గ్రామీణాభివృద్ధి కోసం ఉపాధిహామీతో పాటు ఎన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయ, సహకారాలు పొందొచ్చు? తెలుగుదేశం గత ప్రభుత్వంలోనూ ఉపాధిహామీ సాయంతో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. వాటివల్ల ఎలాంటి సత్ఫలితాలు అందాయి. జిల్లా నుంచి, మండల, గ్రామస్థాయి వరకు అధికారులు ఉపాధిహామిని బాధ్యతగా తీసుకోవాలి. సోషల్ ఆడిట్ పక్కా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అది జరగాలంటే ఎలా? అనే అంశాలపై మరింత సమాచారం నేటి ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.