Pratidwani Debate on Congress Six Guarantees : ఆరు హామీల అమలే తమ తొలి ప్రాధాన్యమంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నమాట ప్రకారం నిర్దేశిత సమయంలోనే వాటి అమలు ప్రారంభిస్తామని భరోసాగా చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. అందుకోసం ఉద్దేశించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి కూడా భారీ ఎత్తునే స్పందన వచ్చింది. మొత్తం 1.2 కోట్ల వరకు వచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల్లో కోటి పైగా హామీలకు సంబంధించినవే.
వాటి పరిష్కారం దిశగా మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. అధికారులూ వెరిఫికేషన్, తదితర కసరత్తుల్లో ఉన్నారు. ఇప్పుడా దరఖాస్తుల పరిష్కారంలో అధిగమించాల్సిన సవాళ్లేంటి? సంక్షేమపథకాల లబ్ధిదారుల ఎంపికలో గతంలో జరిగిన లోటుపాట్లకు తావులేకుండా ఏం చేస్తే మేలు? ప్రభుత్వం నుంచి అత్యధికశాతం ప్రజలేం ఆశిస్తున్నారు? ఇదే అంశంపై ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">