Prathidwani Debate On Telangana Loksabha Elections : సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ, నేతలు ప్రచారంలో వేగాన్ని పెంచుతున్నారు. ప్రత్యర్థి పార్టీలే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ, ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో మాదిరే జోరును కొనసాగించాలని కాంగ్రెస్ యత్నిస్తుండగా, ఉనికి చాటుకునేలా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. నమో మోదీ పేరుతో బీజేపీ సైతం ప్రచారంలో దూసుకుపోతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గడిచిన వంద రోజుల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాంతీయ పార్టీల అవినీతి, కుటుంబపాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో కొత్త జిల్లాలను రద్దు చేస్తుందని బీఆర్ఎస్ చెబుతోంది. ఈసీకి ఫిర్యాదు చేయించి రైతు భరోసా నిలిపేసింది సీఎం రేవంతేనంటూ కేసీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఏఏ పార్టీల మధ్య కొనసాగుతోంది? ఏఏ అంశాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి? ఓటింగ్ శాతం పెంచుకునేందుకు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలేంటి? ఇదే నేటి ప్రతిధ్వని.