Prathidhwani on Rain Water Harvesting : నైరుతి రుతుపనవాలు మన దేశ దక్షిణ తీరానికి చేరుకున్నాయి. మరి కొద్దిరోజుల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాకాలం ప్రారంభం కానుంది. ఈ తరుణంలో పడే వాన నీటిని ఒడిసిపట్టి జల వనరుల సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వాన నీటి ప్రవాహాన్ని వాగులు, చెరువులు, కుంటల్లోకి మళ్లించి నిల్వ చేయాలి. సముద్రంలో కలిసే నీరును పొదుపు చేసుకునే మార్గాలు లేవా? మరోవైపు ఇళ్లు, కార్యాలయాల్లో నీటి వృథాను అరికట్టడం ఎలా?
రోజువారీ అవసరాల కోసం భూగర్భ జలాలే ప్రజలకు ఆధారం. వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఎలా మెరుగుపర్చుకోవాలి? అపార్ట్‌మెంట్లు, కాలనీ సంఘాలు, పౌర సమాజం పాత్ర ఏంటి? అదేవిధంగా వర్షాకాలంలో వాన నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలేంటి? భూగర్భ జలమట్టాలు ఎలా పెంచుకోవాలి? ఇళ్లు, కార్యాలయాల్లో నీటి వృథాను అరికట్టి, నిల్వ సామర్థ్యం పెంచుకోవడం ఎలా? ఇదే నేటి ప్రతిధ్వని.