Prathidwani Debate on Phone Tapping : వ్యక్తిగతం నుంచి వృత్తిగతం దాకా అన్నింటికీ వన్‌స్టాప్ గ్యాడ్జెట్‌గా తయారైంది సెల్‌ఫోన్. కుటుంబ సభ్యులు మిత్రుల వ్యక్తిగత సంభాషణలు, వ్యక్తిగత ఆరోగ్య సమాచారం, వృత్తిపరమైన రహస్యాల డేటా చేరవేతకు చరవాణి మెరుగైన సాధనంగా మారింది. ఇంతటి విలువైన మొబైల్ ఫోన్‌కు ఇప్పుడు డిజిటల్ నిఘా నుంచి ప్రమాదం ఏర్పడుతోంది. ఇటీవల కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది.
అనధికారికంగా జరిగే ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ వంటి చర్యలు వ్యక్తిగత జీవితాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ డిజిటల్ నిఘా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్పందులేంటి? ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇతరశబ్దాలు వినిపిస్తే, మాట్లాడుతున్న కాల్ సడెన్‌గా ఆగిపోతే ఆ ఫోన్ నిఘానీడలో ఉన్నట్లు అనుమానించాలా? ఫోన్‌ట్యాప్ అయ్యింది అనిపిస్తే వెంటనే ఏం చెయ్యాలి? అనధికారిక నిఘాను గుర్తించే మార్గాలు ఏమున్నాయి? అసాంఘిక శక్తులు, సైబర్ నేరస్తుల బారినుంచి సెల్‌ఫోన్‌ను రక్షించుకోవడం ఎలా? ఇదే నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">