Prathidwani on Telangana State Politics : రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికల సమరంలోకి పూర్తిస్థాయిలో దూకాయి. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పార్టీలు తమ అభ్యర్థులకు బీఫాంలు అందిస్తున్నాయి. నామినేషన్లు దాఖలు చేసే సమయం నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గెలవడమే లక్ష్యంగా బలమైన అభర్థులను ఎంపిక చేస్తున్న పార్టీల అధినాయకత్వం, ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అధికార పార్టీలోకి స్థానికంగా నేతల చేరికలు పెరుగుతున్నాయి.
Lok Sabha Elections 2024 : గత ఎన్నికల్లో 3 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, ఈసారి టార్గెట్ 14 చేసుకుని ప్రచారం సాగిస్తోంది. బీజీపీకి నలుగురు సిట్టింగ్ ఎంపీలు అయితే, ఈసారి లక్ష్యం రెట్టింపు చేసుకుంది. బీఆర్ఎస్కు చెందిన 9 మంది సిట్టింగ్ ఎంపీల్లో ఐదుగురు పార్టీ మారారు. బహిరంగ సభలతో బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్ బలాన్ని చేకూరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? అధికార, ప్రతిపక్ష పార్టీలకు కలిసి వచ్చే అంశాలేంటి? సొంత పార్టీల్లో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్న నేతలను పార్టీ నాయకత్వం ఎలా సర్దుబాటు చేస్తోంది? ఇదే నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">