Pratidwani : ప్రపంచాన్ని మొత్తాన్ని యుద్ధమేఘాలు వణికిస్తున్నాయి. దేశాలకు దేశాల మధ్య, దేశాల్లోనే అంతర్గతంగా రేగిన ఘర్షణలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ చూసినా. అంతుదరీ లేని అంతర్యుద్ధాలు, కీలకదేశాల మధ్య రగిలిన పోరాటాలు రావణకాష్టాల్లా రగులుతునే ఉన్నాయి. ఐరోపా, పశ్చిమాసియా ప్రాంతం నుంచి భారత సరిహద్దు దేశాల వరకు అదే పరిస్థితి. ఇప్పుడా జాబితాలో మన పొరుగుదేశం బంగ్లాదేశ్ కూడా చేరింది. స్వల్ప వ్యవధిలో అక్కడ దావానలంలా వ్యాపించిన అల్లర్లతో ప్రభుత్వమే కూలిపోయింది. ఈ పరిణామాలన్నీ దిల్లీ నాయత్వానికి పెడుతున్న పరీక్షలు ఏమిటి? దౌత్యపరంగా, వాణిజ్యపరంగా, భద్రత పరంగా ఇవి విసురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Bangladesh Crisis : బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం భారత్‌కు సవాలుగా మారింది. సుమారు 15 ఏళ్లుగా భారత్‌కు స్నేహహస్తం అందిస్తూ వచ్చిన హసీనా ప్రభుత్వం ఒక్కసారిగా కూలిపోయింది. విపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ-బీఎన్పీ, జమాత్-ఇ-ఇస్లామీ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటుచేస్తే భారత్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్ - Yunus as head of Bangladesh govt
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆ దేశ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి, మాజీ ప్రధాని ఖలీదా జియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు గృహనిర్బంధం నుంచి విడుదలైన ఖలీదాజియా బంగ్లాదేశ్ ఖిలాఫత్ మజ్లీస్ ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశ వనరులు వృథా అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ దేశం తమదని, దాన్ని నిర్మించుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తులను ధ్వంసం చేయటం తీవ్రమైన విషయమని ఖలీదాజియా పేర్కొన్నారు.
'మా అమ్మ ఎక్కడా ఆశ్రయం కోరలేదు'
మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఏ దేశంలోను ఆశ్రయం కోరలేదని ఆమె తనయుడు సాజీబ్ వాజెద్ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం ఆమె వీసాను రద్దు చేసిందంటూ మీడియా కథనాలు వెలువడిన తరుణంలో ఆయన నుంచి ఈ మేరకు స్పందన వచ్చింది. హసీనా ఆశ్రయం విషయంలో యూకే, యూఎస్ ప్రభుత్వాలు స్పందించడం లేదనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని సాజీబ్ వాజెద్ పేర్కొన్నారు. అలాగే అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు.
బంగ్లా సంక్షోభంతో భారత్‌కు పెను సవాళ్లు- ప్లాన్ మార్చకపోతే మొదటికే మోసం! - Bangladesh Crisis