Prathidhwani Debate on Parking Problems : హైదరాబాద్ నగరంలో వాహనాల పార్కింగ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇరుకైన రోడ్లు, రద్దీగా ఉండే రహదారులు, జనసాంద్రత అధికంగా ఉండే వాణిజ్య కూడళ్లు లక్ష్యంగా కొత్త పార్కింగ్ పాలసీ తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అమలుచేస్తున్న పార్కింగ్ విధానానికి తోడుగా ఓ ప్రైవేట్ సంస్థ రూపొందించిన ఆర్గనైజింగ్ పార్కింగ్ విధానాన్నీ పరిశీలిస్తోంది.
Hyderabad Parking Policy 2024 : ఈ మేరకు నగరంలో పార్కింగ్ కేంద్రాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తిస్తోంది. అసలు ఇప్పటివరకు సర్కార్ అనుసరించిన పార్కింగ్ విధానం ఎలాంటి ఫలితమిచ్చింది? ఇకనైనా అధికారిక, అనధికారిక పార్కింగ్ స్థలాల్లో అధిక ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందా? కొత్త విధానంలో ఏఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి? మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కొనసాగుతుందా? పార్కింగ్‌లపై ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేసింది? ఏఏ దేశాలు, నగరాల్లో మెరుగైన విధానాలు ఉన్నాయి? 40శాతం రోడ్లు కార్ల పార్కింగ్ కోసమే వినియోగిస్తున్నారు. స్మార్ట్ పార్కింగ్, పజిల్ పార్కింగ్‌లు మనకు సరిపోతాయా? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">