ETV Bharat / opinion

"ఎన్నికల సమరం" మహారాష్ట్రలో ఆ ఆరు పార్టీలకు అగ్నిపరీక్ష - ఝార్ఖండ్‌లో హోరాహోరీ తప్పదా? - MAHARASHTRA JHARKHAND ELECTION

వేడివేడిగా మహారాష్ట్ర రాజకీయం - పార్టీలకు సవాల్‌గా ఝార్ఖండ్‌ సమరం

MAHARASHTRA_JHARKHAND_ELECTION
MAHARASHTRA_JHARKHAND_ELECTION (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2024, 12:45 PM IST

Prathidwani : మొన్నటికి మొన్నే ఒకచోట బీజేపీ మరోచోట ఇండియా కూటమి తమ బలం ఏంటో చాటుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే బోర్లా పడ్డాయి. సార్వత్రిక సమరం మొదలు 2 రాష్ట్రాల ఫలితాల రోజు వరకు కూడా ఎవరూ ఊహించని పరిణామం అది. సరిగ్గా వారం తరవాత ఇప్పుడు మరో 2 రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.

వచ్చే నెల 13, 20 తేదీల్లో పోలింగ్‌ పూర్తిచేసి 23న ఫలితాలని షెడ్యూల్ వెల్లడించి ఎన్నికల సంఘం. ఈ సారి రేసు గెలిచేది ఎవరు? మరీ ముఖ్యంగా మహారాష్ట్ర మల్లయుద్ధంలో బీజేపీ, కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన మధ్య సమీకరణాలు ఎలా ఉండ బోతున్నాయి? జాతీయ రాజకీయాలకు ఇదేమైనా కొత్త దిక్కు చూపిస్తుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, జాతీయ రాజకీయాలపై వ్యాసకర్త డా. దుగ్గరాజు శ్రీనివాసరావు, రాజకీయ విశ్లేషకులు డా. వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

'మహా' ఎన్నికలపైనే అందరి ఫోకస్​​- 6పార్టీలకు పెద్ద సవాల్​- ప్రజాకోర్టులో మద్దతు ఎవరికో?

Maharashtra Assembly Election 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలైన శివసేన, ఎన్సీపీ ఏవో ప్రజలు తేల్చనున్నారు. మొత్తంగా ఆరు పార్టీలకు ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ చంద్ర పవార్‌), కాంగ్రెస్‌కు ఇది అగ్ని పరీక్షే. చీలిక రాజకీయాలకు, మరాఠా కోటా రిజర్వేషన్ల అంశానికి, ప్రతిపక్ష పోరాటానికి ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా, దశాబ్దాలుగా తమ పార్టీల్లో ఏకఛత్రాధిపత్యం వహించిన పవార్, ఠాక్రే కుటుంబాలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. పార్టీలను చీల్చి శివసేన, ఎన్సీపీల అధికారిక హోదాను దక్కించుకున్న ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌ పవార్‌లకూ కీలకంగా నిలవనున్నాయి. గత ఎన్నికల్లో అధికారానికి చేరువగా వచ్చి శివసేనతో విభేదాల కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీకి, గతంలో సుదీర్ఘ కాలం మహారాష్ట్రలో అధికారం చెలాయించిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకమనే చెప్పాలి.

ఝార్ఖండ్‌లో హోరాహోరీ- రెండు కూటముల బలాలు, బలహీనతలు ఇవే!

Jharkhand NDA And INDIA Alliance : ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)- కాంగ్రెస్‌ కూటమి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమైంది.

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్- పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.