ETV Bharat / opinion

యాదవుల అడ్డాలో బీజేపీ గట్టి సవాల్- సమాజ్​వాదీ కంచుకోటలో విజేత ఎవరో? - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Lok Sabha Elections 2024 Uttar Pradesh : ఉత్తర్​ప్రదేశ్‌లో ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో మూడో విడతలో పోలింగ్‌ జరగనుంది. గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఈసారి కూడా పట్టు నిలపుకోవాలని పావులు కదుపుతుండగా 2014కు ముందు వరకు తమకు అడ్డాగా ఉన్న ఈ స్థానాలను తిరిగి కైవసం చేసుకోవాలని ఎస్​పీ వ్యూహరచన చేస్తోంది. యాదవుల అడ్డాలో ఈసారి పైచేయి కమలనాథులా, లేక సమాజ్‌వాదీలా అనే ఉత్కంఠ నెలకొంది.

Lok Sabha Elections 2024 Uttar Pradesh
Lok Sabha Elections 2024 Uttar Pradesh (ETV BHARAT)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 9:25 AM IST

Lok Sabha Elections 2024 Uttar Pradesh : ఉత్తర్​ప్రదేశ్‌లోని యాదవుల అడ్డాలో సార్వత్రిక సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఓబీసీలు ముఖ్యంగా, యాదవులు అధికంగా ఉండే 10 లోక్‌సభ స్థానాలకు ఈనెల 7న పోలింగ్‌ జరగనుంది. తొలి రెండు విడతల్లో ముస్లింలు, జాట్‌లు అధికంగా ఉండే లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ పూర్తయింది. ఇప్పుడు అందరి దృష్టి ఒకప్పటి సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై పడింది. ఈ ప్రాంతాల్లో ఓబీసీల్లోని యాదవులు, లోథ్‌లు, కచ్చిలు-శాక్యలు-మురావ్‌లు అధికంగా ఉంటారు. వారే గెలుపొటములను ప్రభావితం చేస్తారు.

కొన్నిచోట్ల ముస్లింలు, జాట్ల ప్రాబల్యం కూడా ఉంది. ఆగ్రా, ఫిరోజాబాద్‌, మైన్‌పురి ఒకప్పుడు సమాజ్‌వాదీకి కంచుకోటలుగా ఉండేవి. కానీ 2014 నుంచి బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. గత రెండుఎన్నికల్లో మోదీ ప్రభావం కనిపించింది. 2014లో ఈ 10స్థానాలకు ఏడు గెలుపొందిన బీజేపీ, 2019లో మరో స్థానం పెంచుకొని 8చోట్ల జయకేతనం ఎగురవేసింది. మిగిలిన రెండుసీట్లను సమాజ్‌వాదీ దక్కించుకుంది.

మైన్​పురిలో త్రిముఖ పోరు
సమాజ్‌వాదీ పార్టీకి పెట్టనికోట మైన్‌పురి. 1996 నుంచి ములాయం సింగ్‌ యాదవ్‌ గెలిచారు. మధ్యలో 3సార్లు ఇతరనేతలు గెలుపొందారు. 2022లో ములాయం మరణించడం వల్ల అఖిలేశ్‌ సతీమణి డింపుల్‌ ఉపఎన్నికలో పోటీచేసి విజయం సాధించారు. ఈసారి కూడా ఆమే బరిలో నిలిచారు. బీజేపీ నుంచి జైవీర్‌సింగ్‌, బీఎస్పీ నుంచి శివప్రసాద్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. అభివృద్ధి విషయమై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా ములాయం కోడలిగా డింపుల్‌కే మద్దతు లభిస్తోంది.

సంభల్‌ ఎస్పీ, బీఎస్పీల మధ్య మారుతోంది. మోదీ ప్రభంజనంతో 2014లో బీజేపీ గెలిచింది. 2019లో ఎస్పీతో కలిసి పోటీ చేయడం వల్ల బీఎస్పీ విజయం సాధించింది. ఈసారి ముక్కోణ పోటీ నెలకొంది. ఎస్పీ తరఫున జియా ఉర్‌ రహ్మాన్‌, బీజేపీ తరఫున పరమేశ్వర్‌ లాల్‌, బీఎస్పీ నుంచి షౌకత్‌ అలీ బరిలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి గట్టిపట్టున్న స్థానమైనప్పటికీ, పార్టీలోని గ్రూపుల కారణంగా పట్టు కోల్పోయింది. 1984 తర్వాత నుంచి ఇక్కడ కాంగ్రెస్‌ గెలవలేదు. ఈ నియోజకవర్గంలో ముస్లింలు, యాదవ్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.

హథ్రాస్‌ సామూహిక అత్యాచారం అంశం
హథ్రాస్‌ ఎస్సీ రిజర్వుడు స్థానంలో దళితులు, ఠాకూర్ల ఆధిపత్యం ఉంటుంది. 2020లో ఇక్కడ జరిగిన సామూహిక అత్యాచార ఘటన జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. అదే అంశాన్ని ప్రచారం చేస్తున్న ఎస్పీ మహిళల భద్రతకు హామీ ఇస్తోంది. అగ్రకులాల అధిపత్యమున్న ఈ ప్రాంతంలో ఆ అంశం పెద్దగా ప్రభావం చూపడంలేదు. ఇక్కడ దళితులు 3లక్షలు, ఠాకూర్లు 3 లక్షలు, బ్రాహ్మణులు 2 లక్షలు, వైశ్యులు 1.8 లక్షలు, ముస్లింలు 80వేల మంది ఉన్నారు. అగ్రకులాలు, దళితుల్లో జాటవేతరవర్గాల మద్దతుతో బీజేపీ గెలుస్తోంది. ఈఎన్నికల్లో కమలం పార్టీ తరఫున అనూప్‌ ప్రధాన్‌, ఎస్పీ నుంచి జస్వీర్‌ వాల్మీకీ తలపడుతున్నారు.

అగ్రాలో పతిపక్షాలు బలహీనం
దళితుల రాజధానిగా భావిస్తున్న ఆగ్రాలో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. 3 ఎన్నికల్లో ఆ పార్టీనే గెలిచింది. ఈసారి ఎస్పీ సింగ్‌ బఘెల్‌ను బరిలో నిలిపింది. ఆగ్రాలో దళితులు, జాటవ్‌లు, ముస్లింలు అధికంగా ఉంటారు. ఎస్పీ అభ్యర్థి సురేశ్‌ కర్దం ముస్లింలు, జాటవ్‌ ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి పూజా అమ్రోహీ దళితులను నమ్ముకున్నారు. 2019లో బీజేపీ 2లక్షలకుపైగా మెజారిటీతో విజయం సాధించింది. హిందుత్వ మేనియాతో ఎస్పీ, బీఎస్పీలు బలహీనంగా మారాయి.

బదాయూలో నాటకీయ ఫలితాలు వస్తుంటాయి. ఎస్పీ, బీజేపీ మధ్య దోబూచులాట ఉంటుంది. 2009, 2014లో ఎస్పీ గెలుపొందగా 2019లో బీజేపీ విజయం సాధించింది. ఈసారి బీజేపీ నుంచి దుర్విజయ్‌ శాక్య, ఎస్పీ తరఫున ఆదిత్య యాదవ్‌ పోటీ చేస్తున్నారు. బరేలీ బీజేపీకు కంచుకోట. ఆ పార్టీకి చెందిన సంతోష్‌ గంగ్వార్‌ ఇక్కడి నుంచి 8 సార్లు గెలిచారు. ఈసారి ఆయనను పక్కనపెట్టిన కమలంపార్టీ ఛత్రపాల్‌ సింగ్‌ గంగ్వార్‌ను బరిలోకి దింపింది. ఎస్పీ టికెట్‌పై ప్రవీణ్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు.

ఫరిజోబాద్​లో కుల సమీకరణాలు
ఫిరోజాబాద్‌ సమాజ్‌వాదీ పార్టీ చేజారినట్లే కనిపిస్తోంది. 2009లో ఇక్కడి నుంచే అఖిలేశ్‌ గెలిచారు. ఆయన రాజీనామా చేయటం వల్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌బబ్బర్‌ ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2014లో ఎస్పీ గెలిచినా 2019లో బీజేపీ కైవసం చేసుకుంది. అప్పుడు అఖిలేశ్‌ బాబాయి శివ్‌పాల్‌ సొంత పార్టీ పెట్టుకుని పోటీచేయడం వల్ల బీజేపీ గెలిచింది. ఈసారి సిట్టింగ్‌ ఎంపీని పక్కనపెట్టిన బీజేపీ ఠాకుర్‌ విశ్వదీప్‌ సింగ్‌ను బరిలోకి దించింది. ఎస్పీ తరఫున అక్షయ్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి సత్యేంద్ర జైన్‌ బరిలో ఉన్నారు.

మొఘల్‌ రాజు అక్బర్‌ రాజధాని ఫతేపుర్‌ సిక్రీలో 2019లో బీజేపీ గెలిచింది. ప్రస్తుతం సిటింగ్‌ ఎంపీ రాజ్‌కుమార్‌ చాహర్‌ బీజేపీ తరఫున, మాజీ సైనికుడు రామ్‌నాథ్‌ సికర్‌వార్‌ ఎస్పీ తరఫున, బీఎస్పీ నుంచి రాంనివాస్‌ శర్మ తలపడుతున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు చౌధరి బాబూలాల్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. గత ఎన్నికల్లో హిందుత్వ కార్డుతో కమలం పార్టీ గెలిచింది. ఈసారి పరిస్థితులు మారాయి. కుల సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ఠాకూర్‌, బ్రాహ్మణుల స్వరం మారింది. గంగా నీటిని అందించాలనే డిమాండు వినిపిస్తోంది.

ఎలాలో ఎస్​పీ, బీజేపీ హోరాహోరీ
ఎటాలో శాక్య ఓటర్ల ప్రభావం అధికం. వారికి ఆకట్టుకునేందుకు ఎస్పీ వేశ్‌ శాక్యను బరిలోకి దింపింది. బీజేపీ తరఫున మూడోసారి మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ తనయుడు రాజ్‌వీర్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ తరఫున మహమ్మద్‌ ఇర్ఫాన్‌ బరిలో నిలిచారు. 2019లో ఇక్కడ బీజేపీ గెలిచింది. యాదవుల ప్రాబల్యం అధికంగా ఉండమే కాకుండా శాక్య వర్గం అభ్యర్థిని నిలపడం ద్వారా ఎస్పీ ఈసారి గట్టిపోటీ ఇస్తోంది. ఆంవ్లా లోక్‌సభ స్థానం ఏర్పాటయ్యాక 15సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అన్నిపార్టీలకూ ఆదరణ లభించింది. 2019లో ఇక్కడ గెలుపొందిన బీజేపీ మరోసారి ధర్మేంద్రకశ్యప్‌ను బరిలోకి దించింది.

ఎస్పీ నుంచి నీరజ్‌ మౌర్య, బీఎస్పీ తరఫున అబీద్‌ అలీ పోటీ చేస్తున్నారు. ముస్లింలు, యాదవ్‌లు, కశ్యప్‌లు, మౌర్యులు, ఠాకూర్లు గట్టి ప్రభావం చూపనున్నారు. ఇక్కడ ముస్లింలు 5.5లక్షల మంది, యాదవ్‌లు 2 లక్షలు ఉన్నారు. ఈసారి ఎస్పీ నుంచి బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించే వర్గాలు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి అండగా ఉంటున్నాయి. ప్రభుత్వం తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని విమర్శించే ముస్లింలు కమలం పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఎంతోమంది తమ వారిని బీజేపీ జైళ్లలో పెట్టిందని ఆరోపిస్తున్నారు. హిందూ ఓటర్లకు రామ మందిరమే ప్రధాన అంశంగా మారడమే కాకుండా మోదీ ప్రభావం వారిపై కనిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బంగాల్​లో బిహారీ బాబు Vs సర్దార్ జీ- రెండు పార్టీలూ స్పెషల్ ఫోకస్​- గెలుపెవరిదో? - Lok Sabha Elections 2024

గుజరాత్​ ఎన్నికల్లో కులం కీలకం- 'క్యాస్ట్​ పాలిటిక్స్​'లో ఏ పార్టీ​ సక్సెస్ అయ్యేనో? - lok sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.