ETV Bharat / opinion

మైనారిటీల చుట్టూ 'బంగాల్'​ రాజకీయం- ముస్లింల మొగ్గు TMC వైపేనా? - Bengal Parties WINNING CHANCES - BENGAL PARTIES WINNING CHANCES

Lok Sabha Elections 2024 Bengal Minorites : బంగాల్‌ జనాభాలో దాదాపు 33 శాతం ఉన్న మైనార్టీలు బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ వైపు మూకుమ్మడిగా మొగ్గు చూపాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. మైనార్టీ ఓటర్లలో చీలికే ఇందుకు కారణమని భావిస్తున్న మైనార్టీ నేతలు కాంగ్రెస్​-వామపక్ష కూటమి రూపంలో మరో సెక్యులర్‌ ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌కే తమ ఓట్లన్నీ పడేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

Lok Sabha Elections 2024 Bengal Minorites

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 9:07 AM IST

Lok Sabha Elections 2024 Bengal Minorites : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్షాలు దూసుకుపోతుండడం వల్ల బంగాల్​లో రాజకీయ వేడి పెరిగింది. బంగాల్​లో మళ్లీ సత్తా చాటాలని బీజేపీకి చెక్‌ పెట్టాలని మిగిలిన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బంగాల్​లో చాలా నియోజక వర్గాల్లో మైనార్టీలు గెలుపోటములను నిర్ణయించే దశలో ఉన్నారు. కశ్మీర్, అసోం తర్వాత దేశంలో అత్యధిక ముస్లిం ఓటర్ల సంఖ్య బంగాల్‌లోనే ఉంది. అందుకే అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు మైనార్టీ ఓట్లపైన పడ్డాయి. బంగాల్​లో దాదాపు 33 శాతం మంది మైనార్టీలు ఉన్నారు. ఈ మైనార్టీల ఓట్లను దక్కించుకుని భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్ష-కాంగ్రెస్‌ కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి.

టీఎంసీవైపే మైనార్టీల మొగ్గు!
అయితే వామపక్ష-కాంగ్రెస్‌ కూటమి కంటే తృణమూల్‌ కాంగ్రెస్‌ వైపే మైనార్టీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంగాల్​లోని లోక్‌సభ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే ముస్లింలంతా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నారని మైనార్టీ నాయకులు చెబుతున్నారు. వామపక్ష-కాంగ్రెస్ కూటమిని కాకుండా టీఎంసీనే విశ్వసనీయ శక్తిగా మైనార్టీలు భావిస్తున్నారని ఆ సంఘం నేతలు వెల్లడించారు. మైనారిటీలు అత్యధికంగా ఉన్న ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాల్లో టీఎంసీవైపు మైనార్టీల మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది.

టీఎంసీకి మద్దతుగా ఇమామ్‌ల కృషి?
కాంగ్రెస్‌-వామపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగడం కూడా హస్తం పార్టీకి మైనార్టీలను దూరం చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రామమందిరం ప్రారంభోత్సవం, పౌరసత్వ సవరణ చట్టం అమలే ప్రధాన అంశాలుగా బంగాల్​లో భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే దీదీ ప్రభుత్వంపై కాస్త అసంతృప్తి ఉన్నా బీజేపీని ఎదుర్కోవడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌కే ఓటు వేయడం చాలా కీలకమని మైనారిటీ నాయకులు భావిస్తున్నారు. మైనారిటీ ఓట్లలో చీలిక లేకుండా చూసుకోవాలని ఇమామ్‌లు తమ సభ్యులకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి.

2019 ఎన్నికల్లో మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనూ ఓట్ల చీలక బీజేపీ విజయానికి దోహదపడింది. ఈసారి మైనారిటీ ఓట్లలో చీలిక లేకుండా చూసుకోవాలని, చాలా స్థానాల్లో టీఎంసీకే మొగ్గు ఉంటుందని ఉత్తర బంగాల్‌లోని కొన్ని స్థానాల్లో వామపక్షాలు-కాంగ్రెస్‌ కూటమికి ఆదరణ లభించే అవకాశం ఉందని ఇమామ్-ఎహ్​ ఖాజీ ఫజ్లుర్​ రెహ్మాన్​ అన్నారు.

'సందిగ్ధంలో మైనారిటీలు'
ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాల్లో మైనారిటీలు ఎవరికి ఓటు వేయాలా అన్న సందిగ్ధతలో ఉన్నారని బంగాల్ ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్​ యాహ్యా తెలిపారు. వామపక్ష-కాంగ్రెస్​ కూటమి, టీఎంసీ అభ్యర్థుల్లో ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై సందిగ్ధావస్థలో ఉన్నారని వివరించారు. ఈ జిల్లాల్లో మైనారిటీ ఓట్ల చీలిక వల్ల 2019లో ఉత్తర దినాజ్‌పూర్‌, మాల్దా జిల్లాల్లో బీజేపీ ఒక్కో సీటు గెలుచుకుంది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలంతా టీఎంసీకి మద్దతు పలికారు. ఈసారి కూడా అలాగే మద్దతు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆ స్థానాల్లో 45 శాతంమంది మైనార్టీ ఓటర్లు
బంగాల్​లో 40వేలకుపైగా మసీదులు ఉన్నాయి. ఇందులోని ఇమామ్‌లు మైనారిటీలకు ఓట్ల చీలికపై సందేశాన్ని అందజేయాలని భావిస్తున్నారు. 2019లో ఉత్తర బంగాల్‌లోని మాల్దా, రాయ్‌గంజ్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారుగా 45 శాతంమంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు. కానీ ఓట్ల చీలిక వల్ల బీజేపీ గెలిచింది. బంగాల్లోని 16 నుంచి 18 లోక్‌సభ స్థానాల్లో మైనార్టీల ఓట్లు భారీగా ఉన్నాయి. రాయ్‌గంజ్, కూచ్‌బెహార్, బలూర్‌ఘాట్, మాల్దా నార్త్, మాల్దా సౌత్, ముర్షిదాబాద్, డైమండ్ హార్బర్, ఉలుబెరియా, హవ్‌డా, బీర్భూమ్, కంఠి, తమ్‌లుక్, జాయ్‌నగర్ సహా మరికొన్ని లోక్‌సభ స్థానాల్లో మైనార్టీల ఓట్ల శాతం భారీగా ఉంది.

'బీజేపీ, టీఎంసీకి నిద్ర పట్టడం లేదు'
బంగాల్​లో బీజేపీకి వ్యతిరేకంగా, బలంగా పోరాడేది టీఎంసీనే అని ఆల్ బంగాల్ మైనార్టీ యూత్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్​ కమ్రుజ్జమాన్​ తెలిపారు. 2023లో సాగర్‌డిఘి ఉపఎన్నికల్లో ఓటమి బీజేపీ-టీఎంసీకి ఒక హెచ్చరిక అని సీపీఐ బంగాల్‌ కార్యదర్శి ఎండీ సలీం అన్నారు. మైనారిటీ ఓట్లు వామపక్షాలు, కాంగ్రెస్‌కు తిరిగి వస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమన్నారు. మైనార్టీల ఓట్లు కాంగ్రెస్​ కూటమికి వస్తుండడం వల్ల బీజేపీ, టీఎంసీకి నిద్ర పట్టడం లేదని అన్నారు.

ఈసారైనా ఐఎస్​ఎఫ్ ప్రభావం చూపేనా?
బంగాల్​ రాజకీయ రంగంలోకి అబ్బాస్​ సిద్ధిఖీ నేతృత్వంలోని ఇండియన్​ సెక్యులర్ ఫ్రంట్​ ప్రవేశించినా మైనార్టీల ఓట్లను మాత్రం గెలుచుకోలేకపోయింది. 2021 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎస్​ఎఫ్​కు కేవలం 1.35 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. బంగాల్‌లోని మైనారిటీలు టీఎంసీ అవినీతి, దుష్పరిపాలనతో విసిగిపోయారని ఐఎస్ఎఫ్​ ఎమ్మెల్యే సిద్ధిఖీ వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నామన్న ఐఎస్​ఎఫ్ ఆరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ పార్టీ ఎంత మేర ప్రభావం చూపుతుందో చూడాలి.

బీజేపీకి కలిసివచ్చే అంశాలు!
2014లో టీఎంసీ 34 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. 2019లో ఈ సంఖ్య 22కి తగ్గింది. అయితే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, మైనారిటీలు టీఎంసీకి ఓటు వేసి, వరుసగా మూడోసారి విజయం అందించారు. టీఎంసీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి మైనార్టీలను రక్షించిందని బంగాల్‌లో వామపక్ష-కాంగ్రెస్​ కూటమి బీజేపీకి బీ టీమ్‌ అని టీఎంసీ సీనియర్ నాయకుడు కునాల్​ ఘోష్ అన్నారు. 2017లో ట్రిపుల్​ తలాక్‌ను రద్దు చేయడం, సందేశ్‌ఖాళీలో ఇటీవల జరిగిన ఘటనలు, టీఎంసీ నాయకులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న మహిళల ఆరోపణలు బీజేపీకి కలిసే వచ్చే అవకాశం ఉంది. ముస్లిం మహిళలు ఈసారి తమకు కృతజ్ఞతలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ బంగాల్‌ చీఫ్‌ సుకాంత మజుందార్​ ధీమా వ్యక్తం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బిహార్ రాజకీయమంతా నీతీశ్ చుట్టే​- తలనొప్పిగా చిరాగ్‌ వైఖరి- ఎన్‌డీఏకి గట్టి సవాలే! - bihar lok sabha polls 2024

ఒడిశాలో బీజేపీ, కాంగ్రెస్​ 'పవర్​ పాలిటిక్స్​'- BJD కంచుకోటను బద్దలుగొట్టేదెవరు? - Odisha Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.