ETV Bharat / opinion

వేడెక్కిన జమ్ముకశ్మీర్​ రాజకీయం- కాంగ్రెస్​, ఎన్​సీ పొత్తుతో కుదేలైన PDP! బీజేపీతో మళ్లీ కలుస్తుందా? - Jammu Kashmir Assembly Elections

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 1:11 PM IST

Jammu And Kashmir Elections 2024 : జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. పొత్తు ప్రకటించి ఎన్​సీ, కాంగ్రెస్ జోష్​లో ఉండగా, ఈసారి ఎలాగైనా మంచి ఫలితాలు సాధించాలని బీజేపీ సన్నాహాలు చేస్తోంది. అయితే మరో ప్రధాన పార్టీ పీడీపీ మాత్రం డీలా పడిపోయింది. అగ్రనేతలు పార్టీని వీడుతున్నారు. లోక్​సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమిని చవిచూసింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ విజయావకాశాలు ఏ మాత్రం ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.

Jammu And Kashmir Elections 2024
Jammu And Kashmir Elections 2024 (ANI, ETV Bharat)

Jammu And Kashmir Elections 2024 : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్​సీ), కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పొత్తును ప్రకటించాయి. బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచిస్తోంది. అయితే పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) మాత్రం కాస్త ఇబ్బందుల్లో ఉంది. పార్టీని కొందరు ముఖ్య నాయకులు వీడటం, మరోవైపు ఎన్​సీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల పీడీపీ విజయావకాశాలు కూడా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన లోక్​సభ ఎన్నికల్లో పీడీపీ ఒంటిరిగా బరిలోకి దిగి తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ ఏమాత్రం రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పీడీపీ 31మంది అభ్యర్థులను ప్రకటించింది.

దాదాపు పొత్తు లేనట్లే!
ఇండియా కూటమిలోని పార్టీలైన కాంగ్రెస్, ఎన్​సీ జమ్ముకశ్మీర్​లోని 90 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. కాగా, జమ్ములోని 43 సీట్లలో ఇండియా కూటమికి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కశ్మీర్​లోని 47 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం ఇండియా కూటమి బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడ బీజేపీకి అంత బలం లేదు. కశ్మీర్ లోయలో ఇండియా కూటమికి పీడీపీ, అప్నీ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, స్వతంత్ర అభ్యర్థులతో గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలతో పీడీపీ పొత్తు దాదాపు లేనట్లే కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో పీడీపీతో కలిసి పోటీ చేస్తారా అని ఎన్​సీ అగ్రనేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాను ఇటీవలే విలేకరులు ప్రశ్నించారు. అవన్నీ ఊహాగానాలేనని ఇరువురు నేతలు బదులిచ్చారు. అలాగే జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తారిఖ్ కర్రా సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.

'మా రాజకీయ ప్రత్యర్థి పీడీపీ'
పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి నేతలపై పీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపిందని ఎన్​సీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం ఎలా మాట్లాడగలమని అన్నారు. 1999లో పీడీపీ ఏర్పడినప్పటి నుంచి ఎన్​సీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అని, గత 25 ఏళ్లలో రెండుసార్లు తమను అధికారానికి దూరంగా ఉంచిందని పేర్కొన్నారు. మరోవైపు, ఎన్నికలకు ముందు పొత్తు చర్చలు ఎన్​సీ, కాంగ్రెస్‌ మధ్య మాత్రమే జరిగాయని, పీడీపీని ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు "ఈటీవీ భారత్​"కు తెలిపారు.

31 మంది అభ్యర్థులను ప్రకటించిన పీడీపీ
ఎన్‌సీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కోసం చర్చలు జరుపుతుండగా పీడీపీ 31 మంది అభ్యర్థులను ప్రకటించింది. అందులో 14మంది మాత్రమే పీడీపీ నాయకులు కాగా, మిగతా వారందరూ ఇతర పార్టీ నుంచి వలసవచ్చినవారే కావడం గమనార్హం. అసెంబ్లీ టికెట్​ను ఆశించి కొందరు సీనియర్ నాయకులు పీడీపీలో చేరుతున్నారు. మరికొందరు సీనియర్లు పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో పీడీపీని వీడుతున్నారు. కాగా, పీడీపీ నుంచి త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఎంత మంది గెలిచినా ప్రజల బలమైన గొంతుకగా వారు నిలుస్తారని ఆ పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి నయీమ్ అక్తర్ తెలిపారు.

బీజేపీతో పొత్తు వల్లే పీడీపీ బలహీనం!
2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల పీడీపీ బలహీనపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పొత్తు పీడీపీ నాయకులు, కార్యకర్తలు కొందరికి నచ్చలేదని పేర్కొన్నారు. " 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైద్ధాంతిక విరుద్ధమైన బీజేపీతో పీడీపీ పొత్తు పెట్టుకుంది. పౌర హత్యలు, కాల్పుల ఘటనలను సమర్థించింది. ఆ ప్రభావం పీడీపీపై తీవ్రంగా పడింది. అందుకే ఆ పార్టీ తీవ్రంగా బలహీనపడింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటమిపాలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 8సీట్లలో పీడీపీ విజయం సాధిస్తే అద్భుతమనే చెప్పాలి. " అని సీనియర్ జర్నలిస్ట్ గౌహర్ గిలానీ "ఈటీవీ భారత్‌"కు తెలిపారు.

జమ్ముకశ్మీర్​ ఎన్నికల కోసం NC, కాంగ్రెస్ పొత్తు- రాష్ట్ర హోదానే ప్రాధాన్యం! - Jammu Kashmir Elections

జమ్ముకశ్మీర్​, హరియాణా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్- పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే! - Assembly elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.