Telangana Lok Sabha Election 2024 Prathidwani : పోటాపోటీ ప్రచారాలతో పూర్తిస్థాయి హీటెక్కింది తెలంగాణ రాజకీయం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన స్వల్ప వ్యవధిలో జరుగుతున్న సమరం కావడంతో ఎవరి బలాబలాల్ని వారు తిరిగి నిరూపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో సాధించిన విజయాన్ని సుస్థిరం చేసుకునేందుకు కాంగ్రెస్, పోయిన పట్టుని తిరిగి సాధించుకోవాలని బీఆర్ఎస్, వారిద్దరి వ్యూహాలకందని రీతిలో తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది.
ప్రస్తుతం నామినేషన్ల ఘట్టంతో పతాకస్థాయికి చేరిన ఈ ఎత్తులుపైఎత్తుల్లో ఎవరు ఎక్కడ? 17లో పదికి పైగా స్థానాల్లో పాగా వేయాలనుకుంటున్న పార్టీలకున్న సానుకూల, ప్రతికూలతలేంటి? పోలింగ్ తేదీ నాటికి సమీకరణాలెలా మారొచ్చు? అసలు ఎవరు ఈ ఎన్నికల్లో గెలుపుజెండా ఎగురవేస్తారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">