Pratidhwani on Runamafi for Handloom weavers : చిక్కులో ఉన్న చేనేతలకు కొత్త ఊపిరులు అందించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం సందర్భంగా చేనేత వర్గాలకు పలు వరాలు ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 30 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తామన్నారు. బతుకమ్మ చీరల స్థానంలో 63 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలకు ఏటా 2 చేనేత చీరల పంపిణీ పథకం ప్రారంభిస్తామని తెలిపారు. చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ‘నేతన్నకు చేయూత’ పథకానికి సంబంధించి 290 కోట్ల బకాయిల చెక్కును కూడా అందించారు. వీటన్నింటితో పాటు నేతన్నల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా అండగా ఉంటామని స్వయంగా ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి, ప్రస్తుతం చేనేత రంగం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటి? ప్రభుత్వం చొరవ వారికి ఎలాంటి ధైర్యం ఇస్తుంది. ఇకపై సాగాల్సిన కార్యాచరణ ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
చేనేతకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత - కార్మికుల కోసం రూ.30 కోట్ల రుణ మాఫీ - PRATIDHWANI ON HANDLOOM WEAVERS - PRATIDHWANI ON HANDLOOM WEAVERS
Debate on RunaMafi for Handloom weavers : చేనేతలకు చేయూత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 30 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మరి, ప్రస్తుతం చేనేత రంగం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి? రుణమాఫీతో నేతన్నల కుటుంబాలకు ఎలాంటి ఊరట లభించనుంది? ఒక్కొక్కరికీ ఎంతమేర లబ్ది చేకూరవచ్చు. ఇదే నేటి ప్రతిధ్వని.
Published : Sep 11, 2024, 11:48 AM IST