Prathidhwani Debate on Viksit Bharat 2047 : దేశానికి స్వతంత్రం వచ్చి వందేళ్లు అయిన సందర్భంగా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని సంకల్పం తీసుకున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో మన దేశం ఎన్నో విజయాలను సాధించింది. ఎన్నో మైలురాళ్లను నెలకొల్పింది. అదే సమయంలో నేటికీ మనదేశం అనేక రంగాల్లో వెనుకబడి ఉంది. మనకంటే చిన్న దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆ దిశగా కొంత ఆత్మపరిశీలన కూడా అవసరం. ఆర్థికాభివృద్ధే కాకుండా సర్వతోముఖాభివృద్ధి సాధన ఎలా? ప్రపంచంలో భారత్ ఒక శక్తిగా మనం భావిస్తున్నాం, కానీ యువశక్తి అత్యధికంగా ఉన్న మనదేశం ఒలింపిక్స్‌లో ఎందుకు ప్రభావం చూపలేదు? 2047 నాటికి అగ్రగామి దేశంగా అవతరించాలంటే మన రాజకీయ నాయకుల్లో, దేశపౌరుల్లో ఇంకా ఏఏ విషయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది? ఇదీ నేటి ప్రతిధ్వని.
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం - ఆత్మపరిశీలనతోనే అగ్రస్థానం సాధ్యం! - Prathidhwani on Viksit Bharat - PRATHIDHWANI ON VIKSIT BHARAT
Pratidhwani on Viksit Bharat : దేశానికి స్వతంత్రం వచ్చి వందేళ్లు అయిన వేళ 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. మరి 2047 నాటికి దేశం అగ్రగామిగా అవతరించాలంటే ఏ ఏ అంశాల్లో మెరుగుపడాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Published : Aug 17, 2024, 10:36 AM IST