ETV Bharat / opinion

డ్రగ్స్ భూతం గుప్పిట్లో బంగారు బాల్యం - లక్షల్లోకి చేరుతోన్న బాధిత చిన్నారుల సంఖ్య - Drugs Effects on Children - DRUGS EFFECTS ON CHILDREN

Prathidhwani on Drug Addiction : డ్రగ్స్​ ఊబిలో చిక్కుకుని చిన్నారులు విలవిల్లాడుతున్నారు. చిన్నారులపై మత్తుపదార్థాల ప్రభావం కలవరపెడుతోంది. బడి ఈడు పిల్లలపై మత్తుపదార్థాల దుష్పరిణామాలు ఏ స్థాయిలో ఉంటున్నాయి? ఎన్నివిధాల అనర్థాలకు కారణం అవుతున్నాయి ? చెడు సావాసాలు, వ్యసనాల బారిన పడుతున్నారా అన్నది తెలుసుకోవడం ఎలా? వారి ప్రవర్తన, తీరులో ఏం గమనిస్తూ ఉండాలి? ఇదే నేటి ప్రతిధ్వని.

Debate on Children Drugs Addiction
Prathidhwani on Drug Addiction (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 12:18 PM IST

Debate on Children Drugs Addiction : కొత్తబంగారు లోకంలో విహరించాల్సిన బంగారు బాల్యం, మత్తుపంజరంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. పదేళ్ల ప్రాయం నుంచి అంటుకుంటున్న మత్తు అలవాట్లు కన్నవారి కలలను కళ్లముందే కూల్చేస్తున్నాయి. ఒక్కరో ఇద్దరో కాదు వేలాదిమంది నుంచి ఇప్పుడా సంఖ్య లక్షలకి చేరుతోంది. తల్లిదండ్రులకు తీరని వ్యథ మిగిల్చుతోంది. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న చాపకింద నీరులా విస్తరిస్తునే ఉందీ మాఫియా. ఎన్నో విధాల అనర్థాలకు కూడా కారణం అవుతోంది. ఫలితంగానే టీనేజీ దాటకముందే చేతుల్లో సిగరెట్లు, గంజాయి, ఇతర మత్తుపదార్థాల వినియోగం ఇప్పుడో కొత్త సామాజిక సమస్యగా, సంక్షోభంగా మారుతోంది. మరి ఈ విషయంలో తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.