World Coconut Day and Benefits of Coconut: కొబ్బరి ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరి కాయతోపాటుగా.. చెట్టు కాండం మొదలు.. పీచు, కొబ్బరి పాలు, నూనె.. ఇలా ఎన్నో రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. అందుకే.. కొబ్బరి ఉపయోగాల గురించి అందరిలో అవగాహన కల్పించడానికి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
కొబ్బరి ప్రయోజనాలు:
బరువు తగ్గొచ్చు: కొబ్బరిలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTలు) సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో ఉపయోగపడతాయని.. అలాగే జీవక్రియ రేటును పెంచి, శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడుతున్నవారు కొబ్బరి తింటే బరువు తగ్గుతారని అంటున్నారు. కొబ్బరినూనెతో కూడా బరువు తగ్గొచ్చని(National Library of Medicine రిపోర్ట్) నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొబ్బరి నూనెలో ఉండే మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTలు) ముఖ్యంగా లారిక్ యాసిడ్, క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్.. కొవ్వును కాల్చడానికి దోహదం చేస్తాయని అంటున్నారు.
2015లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కొబ్బరిలోని MCTలు బరువు తగ్గడంలో సహాయపడతాయని కనుగొన్నారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకున్నప్పుడు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూజిలాండ్‌లోని మాస్సే యూనివర్సిటీలో న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో ప్రొఫెసర్ డాక్టర్ కరెన్ మమ్మీ(Karen Mumme) పాల్గొన్నారు.
హృదయ ఆరోగ్యం: కొబ్బరిలోని కొవ్వు ఆమ్లాలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని అంటున్నారు. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందని సూచిస్తున్నారు.
కొబ్బరి నూనె జుట్టుకే కాదు - ఈ పనులకూ ఉపయోగపడుతుంది! ఓ సారి ట్రై చేయండి!
జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది: కొబ్బరిలో ఫైబర్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయని.. ఇవి పేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయని వివరిస్తున్నారు.
బ్లడ్ షుగర్ నిర్వహణ: కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు. ఇందులో ఉన్న పోటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.
కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది: లుటీన్, జియాక్సంతిన్, యాంటీఆక్సిడెంట్లకు కొబ్బరికాయలు మంచి మూలం. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో, వయసు సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు.
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో : కొబ్బరికాయలలోని లారిక్ యాసిడ్ స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్, దంత క్షయానికి దోహదపడే బ్యాక్టీరియాను తగ్గిస్తుందని.. తద్వారా నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని కనుగొన్నారు.
కొబ్బరి నూనెను కాప్రిక్, లారిక్ యాసిడ్ అని కూడా పిలుచుకుంటాం. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ-మైక్రోబయల్ ప్రాపర్టీ చర్మానికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే దీనిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు డెడ్ సెల్స్‌ను తొలగించి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, అలెర్జీల నుంచి రక్షణ కలిగిస్తాయి.
జుట్టు ఎక్కువగా రాలుతోందా? కొబ్బరి నూనె, కరివేపాకుతో సమస్యకు చెక్- అదెలాగంటే?
ఇవి కూడా:
- కొబ్బరిలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
- కొబ్బరిలో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫైబర్, ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బీపీ అదుపులో ఉంటుందని అంటున్నారు.
- కొబ్బరి వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని.. కొబ్బరిలోని లారిక్ యాసిడ్.. ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కొబ్బరి నూనె ఇలా వాడితే - అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!