Tips to Remove Burnt Smell from Food: వంట చేయడం ఓ కళ అంటుంటారు. అయితే ఎంత జాగ్రత్తగా చేసినా ఒక్కోసారి కూరలు, వంటకాలు మాడిపోతుంటాయి. తద్వారా వాటి రుచి తగ్గిపోతుంది. దీంతో చేసేది ఏమీ లేక ఆ వంటలను పడేస్తుంటారు. అయితే కొన్నికొన్ని చిట్కాలు పాటిస్తే కూరలు మాడినా.. ఆ వాసన రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఈ టిప్స్ పాటించడం వల్ల కూర టేస్ట్ కూడా అద్దిరిపోతుందని చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఆలుగడ్డ: కూర/ఇతర పదార్థాలు అడుగంటాయనిపిస్తే.. అందులో కొన్ని పొట్టు తీసిన బంగాళాదుంప ముక్కల్ని వేసి మూత పెట్టి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలని అంటున్నారు. ఫలితంగా మాడు వాసనను ఆ ముక్కలు పీల్చేసుకుంటాయని.. తినే ముందు ఈ ముక్కల్ని తొలగిస్తే సరిపోతుందని.. పైగా టేస్ట్ అద్దిరిపోతుందంటున్నారు.
టమాట: ఒక్కోసారి మనం సమయానికే స్టౌ ఆఫ్ చేసినా.. అడుగున ఉండే పదార్థం కొద్దిగా మాడిపోతుంటుంది. అలాంటప్పుడు రుచి తగ్గకుండా, మాడు వాసన రాకుండా ఉండాలంటే.. అందులో ఆమ్ల గుణాలు కలిగిన నిమ్మరసం, వెనిగర్, టమాట ముక్కలు, టమాట రసం.. వంటివి కొద్దిగా యాడ్ చేస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. పైగా కొన్ని పదార్థాలకు వీటి వల్ల అదనపు రుచి వస్తుందని సూచిస్తున్నారు.
టీ, కాఫీ తయారీకి ఏ పాత్రలు వాడుతున్నారు? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
పెరుగు: కూరలు, గ్రేవీ.. వంటి పదార్థాలు మాడిపోయినప్పుడు క్రీమ్, వెన్న, పెరుగు.. వంటివి కలిపితే అడుగంటినా వాసన రాకుండా ఉంటుందని.. అలాగే ఆ పదార్థానికి మరింత చిక్కదనం కూడా వచ్చి రుచి పెరుగుతుందని అంటున్నారు.
సాస్: గ్రిల్ చేసిన పదార్థాల నుంచి కూడా మాడు వాసన రావడం గమనిస్తుంటాం. అలాంటప్పుడు వాటికి సాస్‌లను జత చేసి తీసుకుంటే.. అందులోని తియ్యదనం, పులుపుదనం.. ఆయా పదార్థాల రుచిని పెంచడంతో పాటు మాడు వాసన రాకుండా చేస్తాయంటున్నారు.
ఉల్లిపాయ: ఇక బిర్యానీ, పులావ్.. వంటివి అడుగంటినప్పుడు.. ఒక ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా తరిగి.. గిన్నెలో నలుమూలలా ఉంచి మూతపెట్టాలి. పావుగంట తర్వాత వీటిని తొలగిస్తే ఫలితం ఉంటుందని అంటున్నారు.
దాల్చినచెక్క పొడి: మాడిపోయిన కూరలు, ఇతర పదార్థాలపై కొద్దిగా దాల్చిన చెక్క పొడిని చల్లినా ఫలితం ఉంటుందని అంటున్నారు. అటు రుచికి రుచి, ఇటు మాడు వాసన రాకుండానూ ఉంటుందని సూచిస్తున్నారు.
ఇవి కూడా:
- ఒక్కోసారి గిన్నె అడుగు భాగం పల్చగా ఉన్నా కూరలు మాడిపోతుంటాయి. కాబట్టి అలాంటి గిన్నెలకు బదులుగా మందపాటి అడుగు ఉన్న గిన్నెల్ని కూర కోసం ఎంచుకుంటే సమస్య ఉండదని చెబుతున్నారు.
- అడుగంటినా కొంతమంది కూర మొత్తం కలిపేస్తుంటారు. దీనివల్ల మాడు వాసన కూర మొత్తం వ్యాపిస్తుంది. కాబట్టి అడుగంటినట్లు గమనించగానే.. పైపైన కూరను విడిగా తీసి వేరే గిన్నెలోకి మార్చుకోవడం మంచిదంటున్నారు.
మీరు వాడుతున్న వంట నూనె మంచిదా? - కల్తీ చేశారా? - ఇలా ఈజీగా తెలుసుకోండి!
ఆకుకూరలను ఇలా వండుతున్నారా? - పోషకాలన్నీ గాల్లో కలిపేస్తున్నట్టే!