What Happens to the Body When We Drink Water After Meals: మన బాడీలోని అన్నీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే డైలీ తగిన మొత్తంలో వాటర్ తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ నిర్వహణలో నీటి పాత్ర చాలా కీలకం. ఈ క్రమంలోనే చాలా మంది భోజనం తర్వాత వాటర్ తీసుకుంటుంటారు. మీరూ తిన్న వెంటనే నీళ్లు(Water) తాగుతున్నారా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యకరమైన అలవాటు కాదంటున్నారు. మీకూ ఆ అలవాటు ఉంటే మానుకోవడం బెటర్ అంటున్నారు. అంతేకాదు.. భోజనం తర్వాత వాటర్ ఎందుకు తీసుకోకూడదో అందుకు గల కారణాలను వివరిస్తున్నారు.
జీర్ణ సమస్యలు వస్తాయి : తిన్నాక వెంటనే నీళ్లు తాగితే అది జీర్ణక్రియను దెబ్బతీసే ఛాన్స్ ఉంటుందంటున్నారు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజేష్. ఎందుకంటే.. భోజనం తర్వాత నీరు తాగడం వల్ల మనం తీసుకునే ఆహారం వేగంగా పేగుల్లోకి చేరుకుంటుంది. దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాక.. కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. కాబట్టి, తిన్న తర్వాత వీలైనంత వరకు వాటర్ తాగకుండా జాగ్రత్త పడడం మంచిదంటున్నారు.
2011లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. భోజనం తర్వాత నీటి వినియోగం పలు జీర్ణ సమస్యలకు దారితీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ బుండాంగ్ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ Sung Kook Park పాల్గొన్నారు.
బరువు పెరుగుతారు : భోజనం తిన్న వెంటనే నీరు తాగితే కడుపు నిండిన భావన కలగదని.. తద్వారా ఎక్కువ ఆహారం తినడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలా ఎక్కువ మొత్తంలో కేలరీలు కలిగిన ఆహారం తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
అలర్ట్ : తిన్న తర్వాత ఈ 5 పనులు అస్సలు చేయొద్దు - ఆరోగ్యానికి ముప్పు తప్పదు!
పోషకాల శోషణను తగ్గిస్తుంది : తిన్న వెంటనే నీరు తాగడం మూలంగా శరీరానికి అందాల్సిన పోషకాల శోషణ తగ్గుతుందంటున్నారు. ఎందుకంటే.. భోజనం తర్వాత వాటర్ తాగితే అందులోని పోషకాలు పలుచన అవుతాయి. దాంతో బాడీ వాటిని సరిగా గ్రహించుకోలేదు. ఆ కారణంగా మీరు పోషకాహారలేమితో బాధపడవచ్చు. అలాగే మరికొన్ని ఆరోగ్య సమస్యలు బారిన పడే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.
తిన్నాక నీరు ఎప్పుడు తాగాలంటే?: భోజనం చేశాక కనీసం పావుగంట నుంచి అరగంట వరకు గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగితే బెటర్ అంటున్నారు. గంట తర్వాత తాగితే మరీ మంచిదంటున్నారు. అలా తాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలగదని, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికీ సహాయపడుతుందని చెబుతున్నారు. ఇంకా మలబద్దకాన్ని కూడా నివారిస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బీకేర్‌ఫుల్ : ఈ ఆహార పదార్థాలు తిన్న తర్వాత అస్సలు నీరు తాగకండి! - లేదంటే ప్రాణాలకే ప్రమాదం!