How to Make Veg Burger at Home : ఈరోజుల్లో చాలా మంది పిల్లలు పిజ్జా, బర్గర్లు తినడానికి ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, బేకరీలో తయారు చేసేవి అంత ఆరోగ్యకరమైనవో.. కావో.. తెలియదు. కాబట్టి.. మీరే ఇకపై పిల్లలు బర్గర్ కావాలని అడిగినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా "వెజ్ బర్గర్" ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఇది రుచిలో బేకరీలో దొరికే వాటికి ఏమాత్రం తీసిపోదు. అంత టేస్టీగా ఉంటుంది! పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ! ఇంతకీ.. వెజ్ బర్గర్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బంగాళ దుంపలు - 2
- ఆయిల్ - 2 టీస్పూన్లు
- బఠాణీ - 2 టీస్పూన్లు
- ఫ్రెంచ్ బీన్స్ - ముప్పావు కప్పు
- క్యారెట్ తురుము - అర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - అర టీస్పూన్
- మిరియాల పొడి - అర టీస్పూన్
- బ్రెడ్ క్రంబ్స్ - 2 టీస్పూన్లు
- మైదా - 2 టేబుల్ స్పూన్లు
- బ్రెడ్ క్రంబ్స్ - అరకప్పు
- నూనె - తగినంత
- బర్గర్ బన్స్ - 2
- టమాటా కెచప్ - కొద్దిగా
- మయోనైజ్ - కొద్దిగా
- లెట్యూస్ ఆకులు - కొన్ని
- చీజ్ స్లైసెస్ - 2
- టమాటా - 1
- ఆనియన్ - 1
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన బంగాళదుంపలను మెత్తగా ఉడికించి పొట్టు తీసి మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- బంగాళదుంపలు ఉడికే లోపు బీన్స్‌ను సన్నగా తరుక్కోవాలి. అలాగే.. క్యారెట్ తురుము ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పచ్చి బఠాణీలను క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై.. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. అందులో క్రష్ చేసి పెట్టుకున్న బఠాణీ, తరిగి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ తురుము వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి కలుపుకొని ఆ వెజిటబుల్స్ 75% వరకు ఉడికేలా కుక్ చేసుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక.. ఆ మిశ్రమంలో ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్‌ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై పాన్‌ను దించుకొని చల్లార్చుకోవాలి.
- ఆ మిశ్రమం చల్లారాక అందులో బ్రెడ్ క్రంబ్స్ పొడి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఈ పొడి కలపడం ద్వారా పాట్టీస్ అనేవి నూనెలో వేసినప్పుడు విరిగిపోవు.
- తర్వాత ఆ మిశ్రమాన్ని రెండు భాగాలుగా తీసుకొని పాట్టీస్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం మరో బౌల్లో మైదా పిండిని తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా జారుడులా కలుపుకోవాలి. అలాగే.. ఒక ప్లేట్లో బ్రెడ్ క్రంబ్స్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాట్టీస్ను జాగ్రత్తగా మైదా మిశ్రమంలో రెండు వైపులా ముంచి ఆపై బ్రెడ్ క్రంబ్స్తో అన్ని వైపులా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. బ్రెడ్ క్రంబ్స్ అందులో వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవిధంగా వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు రెండు బర్గర్ బన్స్‌ను మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ ఒక సగ భాగానికి టీస్పూన్ టమాటా కెచప్, మరో సగభాగానికి మయోనైజ్ అప్లై చేసుకోవాలి.
- ఆ తర్వాత టమాటా కెచప్ అప్లై చేసుకున్న దానిపై మూడు తాజా లెట్యూస్ ఆకులు ఉంచి దాని మీద ఫ్రై చేసుకున్న ఒక పాట్టీస్ పెట్టుకోవాలి. క్యాబేజీ ఫ్యామిలీకే చెందిన ఈ ఐస్‌బర్గ్ లెట్యూస్ అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది.
- తర్వాత ఆ ప్యాటీస్ మీద ఒక చీజ్ స్లైస్, మూడు టమాటా స్లైసెస్, కొన్ని ఉల్లిపాయ ముక్కలు పెట్టి ఆపైన చిటికెడు ఉప్పు, మిరియాల పొడి చల్లుకోవాలి.
- ఆపై కొద్దిగా టమాటా కెచప్ వేసుకొని మయోనైజ్ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్‌తో క్లోజ్ చేసుకుంటే చాలు.
- అంతే.. యమ్మీ, యమ్మీ అనిపించే "బెకరీ స్టైల్ వెజ్ బర్గర్" రెడీ!
ఇవీ చదవండి :
ఇంట్లోనే అద్భుతమైన పావ్‌భాజీ బర్గర్ - స్ట్రీట్ ఫుడ్ అంత టేస్టీగా.. అంతకు మించిన హెల్తీగా!
కేవలం బియ్యం పిండితో "కరకరలాడే కారం చిప్స్" - నిమిషాల్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండిలా!