ETV Bharat / offbeat

ఈ కాలేజీలో సీటు దొరికితే ఉద్యోగం వచ్చినట్లే! - కోర్సు పూర్తయ్యే నాటికి చేతిలో కొలువు పక్కా!! - TRAINING TO GET JOBS AT JNTUH

జేఎన్టీయూ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు - కోర్సు పూర్తయ్యే నాటికి ఉద్యోగాలు సాధించేలా శిక్షణ

TRAINING TO GET JOBS AT JNTUH
JNTUH Engineering Colleges In Sangareddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2024, 12:49 PM IST

JNTUH Engineering Colleges In Sangareddy : కోటి చదువులు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఎంత చదివినా ఎన్ని డిగ్రీలు చేతికి వచ్చినా ఉద్యోగం సాధించకుంటే వృధా. ఉద్యోగం కోసమే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు. దీనికోసం సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ప్రాంగణ నియామకాలతో కళాశాలలో చేరిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యేనాటికి ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇస్తుంది.

కొలువుల ప్రాంగణం : ఈ కళాశాలను 2012లో ప్రారంభించారు. ఈ కళాశాలలో ఈసీఈ, సీఎస్‌ఈ, ఎంఈసీహెచ్, సివిల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తృతీయ సంవత్సరం చదువుతున్న వారిలో ఎక్కువ మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికకావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఈ కళాశాలలో ప్రస్తుతం 1,594 మంది చదువుతున్నారు.

మూడేళ్లలో 693 మందికి ఉద్యోగాలు : గత మూడు సంవత్సరాల్లో ఈ కళాశాల నుంచి 693 మంది ఉద్యోగాలు పొందారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, బ్యాంకింగ్‌ రంగాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. జేఎన్టీయూ కళాశాల విద్యార్థులకు అధ్యాపకులు బోధనతో పాటు ఉద్యోగ సాధన దిశగా శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం కళాశాలలో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. కంపెనీలు, విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఉద్యోగాలు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. చివరి సంవత్సరం విద్యార్థులందరూ ప్రాంగణ నియామకాల్లో పాల్గొనేలా వారికి శిక్షణ ఇస్తున్నారు. తరచూ రాత పరీక్షలు, ఉపన్యాస పోటీలు, నమూనా ముఖాముఖీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు.

"బీటెక్ చదువు పూర్తి కాకుండానే నాకు హెచ్‌ఎస్‌బీసీ కంపెనీలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. సంవత్సరానికి రూ.9 లక్షల ప్యాకేజీ వస్తుంది. నాకు ఉద్యోగం రావడంలో ఫ్యాకల్టీల కృషి ఎక్కువగా ఉంది. ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలి. ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలు ఎలా చెప్పాలనే అంశాలపై తర్ఫీదు ఇచ్చారు. అధ్యాపకుల సూచనలు పాటించడం వల్లే ఉద్యోగం సాధ్యమైంది. ప్రస్తుతానికి ఇందులో ఉద్యోగం చేస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నేను స్థిరపడటంతో పాటు నలుగురికి ఉపాధి చూపే స్థాయికి ఎదగాలన్నదే నా లక్ష్యం."- విద్యార్థులు, జేఎన్‌టీయూ కళాశాల

కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల కుదింపు, పెంపు వ్యవహారం - ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు

బీటెక్ ఫస్ట్ ఇయర్​లో 9,677 విద్యార్థులు ఫెయిల్ - జేఎన్టీయూలో ఏం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.