Tips to Washing Woolen Clothes : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో పిల్లలు, పెద్దలందరూ స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించి చలి నుంచి రక్షణ పొందుతున్నారు. అయితే.. ఈ ఉన్ని దుస్తులు దుర్వాసన వస్తున్నాయనో, మాసిపోయాయనో రెండు వారాలకోసారి ఉతుకుతుంటారు. కానీ.. ఎలా పడితే అలా వీటిని వాష్ చేస్తే..దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని టిప్స్ పాటిస్తూ వీటిని ఉతకడం వల్ల ఎక్కువ కాలంపాటు కొత్తగా కనిపిస్తాయని అంటున్నారు. ఆ చిట్కాలు మీ కోసం..
వాషింగ్ మెషీన్లో ఇలా :
ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో వాషింగ్ మెషీన్ కామన్. అయితే.. స్వెట్టర్లు, మఫ్లర్ల లాంటి ఇతర ఉన్ని వస్త్రాలను మిగతా దుస్తులతో కలిపి వాషింగ్ మెషీన్లో వేయకూడదట. వాటిని విడిగా ఉతకాలని సూచిస్తున్నారు. వాషింగ్ మెషీన్లో ఉతికే ముందు.. ఉన్ని దుస్తులపై లేబుల్స్ చెక్ చేయండి. లేబుల్స్‌పై ఎంత ఉష్ణోగ్రత వద్ద, ఏ సెట్టింగ్ ఆన్ చేసి ఉతకాలో క్లియర్‌గా ఉంటుంది. కాబట్టి, లేబుల్‌ను జాగ్రత్తగా పరిశీలించి.. సెట్టింగ్స్ ఆన్ చేసి వాష్ చేయాలి.
లిక్విడ్ డిటర్జెంట్ :
ఎక్కువ మంది సాధారణ దుస్తులను ఉతకడానికి ఉపయోగించే డిటర్జెంట్‌నే ఉన్ని దుస్తులను ఉతకడానికి కూడా వాడతారు. కానీ వాటిని వాష్ చేయడానికి లిక్విడ్ డిటర్జెంట్ ఉపయోగిస్తే మంచిది. ఎందుకంటే.. సాధారణంగా ఉన్ని దుస్తులు చాలా మృదువు స్వభావాన్ని కలిగి ఉంటాయి. లిక్విడ్ డిటర్జెంట్‌లో ఉండే మృదువైన కెమికల్స్ వాటి.. నాణ్యత పాడవ్వకుండా శుభ్రం చేస్తాయి. కాబట్టి, ఉన్ని దుస్తులను వాష్ చేయడానికి లిక్విడ్ డిటర్జెంట్ బెస్ట్ ఆప్షన్.
మరకలను ఇలా మాయం చేయండి..
కొన్నిసార్లు అనుకోకుండా స్వెట్టర్లపై మరకలు పడుతుంటాయి. ఇలాంటప్పుడు గట్టిగా రుద్దకూడదు. అలాగే డైరెక్ట్‌గా వాషింగ్ మెషీన్లో వేస్తే మరక వదలదు. ఇలాంటప్పుడు ఫస్ట్ సాఫ్ట్ స్టెయిన్ రిమూవర్‌తో మరకల్ని తొలగించాలి. అలాగే.. మైల్డ్ లిక్విడ్ డిటర్జెంట్, నిమ్మరసం వంటివి కూడా ఉపయోగించవచ్చు. వీటిని మరక ఉన్న చోట పోసి కాసేపు రుద్దాలి. ఆ తర్వాత వాషింగ్ మెషీన్లో వేస్తే మరక పూర్తిగా తొలగిపోతుంది.
మరికొన్ని టిప్స్..
- ఉన్ని వస్త్రాలను నేరుగా ఎక్కువ ఎండ ఉన్న చోట ఆరేయకూడదు. దీనివల్ల దుస్తులు రంగు మారడంతోపాటు.. త్వరగా పాడవుతాయి. అందుకే కాస్త తక్కువ ఎండపడే చోట ఆరేయాలి.
- ఎప్పుడైనా సరే ఉన్ని దుస్తులను వాషింగ్ మెషీన్లో హై స్పీడ్‌తో వాష్ చేయకూడదు. హై స్పీడ్ వాష్‌తో ఫ్యాబ్రిక్ చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, కాస్త స్పీడ్ తక్కువగా అడ్జస్ట్ చేసి ఉతకాలి.
- ఉన్ని దుస్తులను నార్మల్ ఐరన్ బాక్స్‌తో ఐరన్ చేయకూడదు. వాటిని ప్రత్యేకంగా స్టీమ్ ఐరన్ చేయాలని గుర్తుంచుకోండి.
- ఇంకా ఉన్ని దుస్తులను ఎక్కువ సేపు నీటిలో నానబెట్టకూడదు. కేవలం 10-15 నిమిషాలు మాత్రమే నానబెట్టి త్వరగా ఉతకాలి.
- మీ దగ్గర లిక్విడ్ డిటర్జెంట్ లేకపోతే బేబీ షాంపూ ఉపయోగించవచ్చు.
- మరో ముఖ్య విషయం ఉన్ని దుస్తులను ఎప్పుడూ చల్లటి నీటిలోనే ఉతకాలి. వేడి నీటితో ఉతకడం వల్ల అవి త్వరగా పాడవుతాయని నిపుణులు చెబుతున్నారు.
వాషింగ్ మెషీన్లో బ్రా ఉతికితే డ్యామేజ్ అవుతుందంట - ఇలా వాష్ చేస్తే ఎక్కువ కాలం మన్నికగా!
వాషింగ్ మెషీన్లో బట్టలకు గంజి పెట్టొచ్చని మీకు తెలుసా? - ప్రాసెస్ వెరీ ఈజీ - ఇప్పుడే తెలుసుకోండి!