ETV Bharat / offbeat

గంజి నీళ్లను పారబోస్తున్నారా? ఇలా ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు! - RICE PORRIDGE BENEFITS

గంజి నీళ్లను ఇలా కూడా వాడచ్చు! -అవేంటో మీకు తెలుసా?

Rice Porridge Water Benefits
Rice Porridge Water Benefits (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2025, 4:55 PM IST

Rice Porridge Water Benefits: ప్రస్తుత కాలంలో చాలా మంది అన్నం వండడానికి రైస్​ కుక్కర్​ ఉపయోగిస్తున్నా, కొంతమంది ఇప్పటికీ గ్యాస్​ స్టవ్​పై అన్నం వండుతున్నారు. ఈ క్రమంలో అన్నం వార్చిన గంజిని చెట్లకు, లేదా సింక్​లో వృథాగా పారబోస్తుంటారు. ఒకప్పుడు ఈ గంజి నీళ్లనే ఎక్కువ మంది ఆహారంగా తీసుకునే వారు. అయితే, ఈ గంజి నీళ్లను బయట పారబోయకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గంజి నీళ్లతో కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సూప్స్​ : చాలా మంది టమాటా, క్యారెట్​, చికెన్​ సూప్​ వంటివి ఇష్టపడుతుంటారు. ఇలా వెజ్​ లేదా నాన్​వెజ్​ సూప్​ ఏది ప్రిపేర్​ చేసినా అందులో నీటితో పాటు గంజి నీళ్లను కూడా కొద్దిగా పోయండి. దీనివల్ల సూప్స్​ చిక్కగా టేస్టీగా ఉంటాయి. గంజి నీళ్లతో మీరు ఓట్స్​ కూడా వండుకోవచ్చు.

స్మూతీస్ : సాధారణంగా ఇంట్లో పండ్లు, ఆకుకూరలతో స్మూతీస్​ చేసినప్పుడు వాటర్​ పోసి గ్రైండ్​ చేస్తుంటాం. అలా కాకుండా ఈ గంజి నీళ్లను ఉపయోగించడం ద్వారా మరింత రుచిగా ఉంటుంది. అలాగే మనకు అందులోని విటమిన్లు, పోషకాలు అందుతాయి.

క్వినోవాను ఉడికించేందుకు : బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు క్వినోవాని ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనిని అన్నం మాదిరిగానే వండుకోవచ్చు. అయితే, ఇక్కడ క్వినోవా నానబెట్టిన తర్వాత నీటితో పాటు కొన్ని గంజి నీళ్లను ఉపయోగించండి. తద్వారా క్వినోవా మరింత రుచికరంగా ఉంటుంది. మీరు కూరలను ఉడికించేందుకు కూడా గంజి నీళ్లను వాడవచ్చు.

సాస్, గ్రేవీస్ : ఇంట్లో సాసెస్, గ్రేవీస్ వంటివి చేసినప్పుడు ఈ గంజి నీళ్లను వాడండి. దీంతో అవి సూపర్​ టేస్టీగా వస్తాయి. అలాగే సాస్​, గ్రేవీస్​ మరింత చిక్కగా ఉంటాయి.

ఈ విషయం మర్చిపోవద్దు! ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే వంటల్లో గంజి నీటిని ఉపయోగించే ముందు బాగా వడపోయాలి. సూప్స్​, స్మూతీస్​, ఉడికించేందుకు ఇలా ఎందులోకైనా పూర్తిగా గంజి నీటినే వాడకుండా కొద్దిగా పోయాలి. లేకపోతే వాటి రుచి మొత్తం మారిపోతుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే గంజిలో స్టార్చ్​ అధికంగా ఉంటుంది.

ఈ ఉపయోగాలు కూడా: ఎప్పటి నుంచో కాటన్ దుస్తులకు గంజి ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది బియ్యం వండడం వల్ల వచ్చే గంజిని వాడడం మానేసి, బయట మార్కెట్లో రెడీమేడ్​గా దొరుకుతున్న గంజి పొడిని వాడుతున్నారు. ఇలా కాకుండా ఇంట్లో తయారు చేసిన గంజిని ఉపయోగించడం వల్ల దుస్తులకు ఎలాంటి ముప్పు ఉండదు. అలాగే ఎక్కువ కాలం మన్నుతాయి కూడా.

మరకలు మాయం! గంజినీళ్లతో ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా గంజిలో బేకింగ్ సోడా, ఉప్పు కలిపి స్ప్రే బాటిల్ లో వేసి, వాటిని ఎక్కడ మరకలు ఉంటే అక్కడ స్ప్రే చేయాలి. స్ప్రే చేశాక వస్త్రంతో గట్టిగా రుద్దడం వల్ల ఆ మరకలు తొలగిపోతాయి. ముఖ్యంగా గాజు వస్తువులపై ఉన్న మరకలను తొలగించడానికి ఈ గంజి నీటి చిట్కా బాగా ఉపయోగపడుతుంది.

మీరు మటన్ ప్రియులా! - మాంసంలో ఏ భాగాన్ని కొనాలో తెలుసా?

'ఎడమచేతి వాటం' కారణాలు ఏమిటో తెలుసా? - ఆ జాబితాలో ఎందరో ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.