How to Make Rice Flour Jantikalu : చాలా మంది ఇష్టపడే పిండి వంటకాలలో ఒకటి.. జంతికలు. వీటినే 'మురుకులు' అని కూడా అంటారు. పండగలు, శుభకార్యాల సమయంలో, ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకుంటుంటారు ఎక్కువ మంది. ఈ క్రమంలోనే కొందరు మురుకులను బియ్యప్పిండితో తయారు చేసుకున్నప్పుడు.. మెత్తగా, గట్టిగా వస్తున్నాయని బాధపడుతుంటారు. అలాంటివారు ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే జంతికలు గుల్లగా, క్రంచీగా వస్తాయి! పైగా వీటి తయారీకి శనగపిండి వాడట్లేదు కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్, అజీర్తి వంటి సమస్యలు రావట. మరి, ఇంకెందుకు ఈ సూపర్ టేస్టీ.. బియ్యప్పిండి జంతికలు ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పుట్నాల పప్పు - ముప్పావు కప్పు
- బియ్యప్పిండి - రెండున్నర కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా
- నువ్వులు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
- కారం - 2 టీస్పూన్లు
- బటర్ - 25 గ్రాములు
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు(ఆప్షనల్)
- వాటర్ - పిండి తడుపుకోవడానికి కావాల్సినంత
- ఆయిల్ - వేయించడానికి తగినంత
తయారీ విధానం :
- ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. మొదటగా మిక్సీ జార్లో పుట్నాలను తీసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అందులో బియ్యప్పిండి, ఉప్పు, నువ్వులు, కారం, బటర్.. ఇలా ఒక్కొక్కటి వేసుకొని పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- అయితే, ఇక్కడ మీరు నువ్వులు వద్దనుకుంటే వాముని వాడుకోవచ్చు. అలాగే.. మీ దగ్గర బటర్ లేకపోతే కాగబెట్టుకున్న నెయ్యిని వేసుకోవచ్చు.
- తర్వాత ఆ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్‌గా మారేంత వరకు కలుపుకోవాలి.
- ఆ విధంగా పిండిని కలిపిపెట్టుకున్నాక దానిపై ఒక పల్చని తడిగుడ్డను ఉంచి పది నిమిషాల పాటు అలా వదిలేయాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యేలోపు.. మురుకులు ప్రిపేర్ చేసుకునేది తీసుకుని దాని లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి.
- తర్వాత మీరు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిముద్దను తీసుకొని మురుకుల గొట్టంలో పైన కొద్దిగా గ్యాప్ ఉంచి కూరుకోవాలి.
- ఇక నూనె వేడి అయిందనుకున్నాక.. మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మురుకుల గొట్టంతో నేరుగా నూనెలో మురుకుల షేప్‌లో పిండిని వత్తుకోవాలి.
- లేదంటే.. చిల్లుల గరిటె తీసుకొని దాని మీద మీకు కావాల్సిన షేప్‌లో పిండిని వత్తుకొని ఆపై వాటిని కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వొచ్చు.
- ఆ తర్వాత మంటను మీడియం టూ హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మురుకులను అటూ ఇటూ గరిటెతో తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా కాలే వరకు వేయించుకోవాలి.
- క్రిస్పీగా వేగాయనుకున్నాక.. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే బియ్యప్పిండి జంతికలు రెడీ!
- అయితే.. మురుకులు వేయించేటప్పుడు ఈ టిప్ పాటిస్తే అవి చాలా క్రంచీగా, క్రిస్పీగా రావడమే కాకుండా నూనె పీల్చకుండా గుల్లగా వస్తాయంటున్నారు వంట నిపుణులు. అదేంటంటే.. వేయించేటప్పుడు మురుకులను మరీ ఎక్కువగా.. తక్కువగా ఫ్రై చేయకూడదు.
- ఎందుకంటే తక్కువగా ఫ్రై చేస్తే.. లోపల మెత్తమెత్తగా ఉంటాయి. ఎక్కువగా ఫ్రై చేస్తే బాగా గట్టిగా వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- అందుకే.. మురుకులను మీడియం, లైట్ గోల్డెన్ కలర్లోకి ఛేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుందట.
ఇవీ చదవండి :
సాయంత్రం వేళ - క్రిస్పీ క్రిస్పీ 'కార్న్ సమోసా' - ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి!
నోరూరించే నూడుల్స్- ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినడం పక్కా!