ETV Bharat / offbeat

ఆలుగడ్డతో అద్దిరిపోయే వడలు పది నిమిషాల్లోనే! - ఇలా ప్రిపేర్ చేస్తే వహ్వా అంటారు! - Aloo Vada Recipe

Aloo Vada Recipe : వడ.. అబ్బో దాని టేస్టే వేరు. అయితే, నార్మల్​గా వడలు చేసుకోవాలంటే కాస్త టైమ్​తో కూడుకున్న పని. కానీ, అలాకుండా పదే పది నిమిషాల్లో సూపర్ టేస్టీగా ఉండే వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు తెలుసా? అవే.. 'ఆలూ వడలు'. మరి, వీటిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How To Make Vada With Aloo
Aloo Vada Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 2:49 PM IST

How To Make Vada With Aloo : చాలా మంది మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో తినే వాటిలో వడ ఒకటి. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే.. సాధారణంగా వడలను ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రే మినప పప్పును నానబెట్టుకొని.. గ్రైండ్ చేసుకోవాలి. కానీ.. ఆలుగడ్డలతో ఇన్​స్టంట్​గా, ఈజీగా వడలు ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును.. బంగాళదుంపలతో(Potato) టేస్ట్, టైమ్ రెండు కలిసొచ్చే విధంగా చాలా ఈజీగా నోరూరించే వడలను తయారుచేసుకోవచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • అరకేజీ - ఆలుగడ్డలు
  • ఒకటి - ఉల్లిపాయ
  • రెండు - పచ్చిమిర్చి
  • పావు స్పూన్ - అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ఒక స్పూన్ - రెడ్ చిల్లీ పౌడర్
  • తగినంత - నూనె
  • పావు టీ స్పూన్ చొప్పున - జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్​చూర్ పౌడర్
  • కొన్ని - చిల్లీ ఫ్లేక్స్
  • 2 టేబుల్ స్పూన్లు - కార్న్ ఫ్లోర్
  • 2 టేబుల్ స్పూన్లు - బ్రెడ్ క్రంబ్స్
  • రెండు రెమ్మలు - కరివేపాకు
  • కొద్దిగా - కొత్తిమీర
  • రుచికి సరిపడా - ఉప్పు

తయారీ విధానం :

  • ముందుగా ఒక బౌల్​లో బంగాళదుంపలు తీసుకొని వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఆపై వాటిని చల్లారిన తర్వాత పొట్టు తీసి గ్రేటర్​తో సన్నగా తురుముకోవాలి.
  • ఆలూ ఉడికే లోపే.. రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే.. కొత్తిమీర, కరివేపాకును సన్నగా తరుక్కోవాలి.
  • ఇప్పుడు ఒక బౌల్​లో ఆలూ తురుము తీసుకొని అందులో.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్​చూర్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • అలాగే.. కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రంబ్స్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిశ్రమం మొత్తాన్ని చపాతీ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే, ఇక్కడ వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆలూలో ఉన్న వాటరే సరిపోతుంది.
  • అయితే, పిండి ముద్దలా కలుపుతున్నప్పుడు విరిగిపోతున్నట్లు అనిపిస్తే చేయి కాస్త తడి చేసుకొని కలుపుకోవాలి.
  • ఆవిధంగా పిండిని రెడీ చేసుకున్నాక.. చేతులకు కాస్త ఆయిల్ రాసుకొని కొంచం ఆలూ మిశ్రమాన్ని తీసుకొని వడ షేప్​లో వత్తుకోవాలి.
  • అనంతరం స్టౌపై.. పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి.
  • నూనె వేడెక్కాక ప్రిపేర్ చేసుకున్న వడలను అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకోవాలి.
  • ఆపై వాటిని ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే ఘుమఘుమలాడే "ఆలూ వడలు" రెడీ!

ఇవీ చదవండి :

'ఆలూ మాసాలా సాండ్​విచ్' - ఇలా చేసి పెడితే - పిల్లలు 'మమ్మీ ఇట్స్​ టూ యమ్మీ' అనడం పక్కా!

రెస్టారెంట్ స్టైల్​లో క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై - ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.