ETV Bharat / offbeat

నోట్లో వేస్తే కరిగిపోయే "స్పాంజ్ దోశ"- సింపుల్​గా ఇలా ప్రిపేర్ చేసుకోండి- టేస్ట్ మామూలుగా ఉండదు! - Sponge Dosa Recipe - SPONGE DOSA RECIPE

Poha Dosa Recipe : చాలా మంది ఎక్కువగా ఇష్టపడే బ్రేక్​ఫాస్ట్ ఐటమ్స్​లలో ఒకటి.. దోశ. కానీ, ప్రతిసారీ క్రిస్పీ దోశలు తిని బోర్​గా అనిపిస్తోందా? అయితే, ఈసారి వెరైటీగా 'స్పాంజ్ దోశ'ను ట్రై చేయండి. పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఈ దోశ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది! మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Sponge Dosa Recipe
Poha Dosa Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Aug 30, 2024, 4:14 PM IST

How to Make Sponge Dosa Recipe in Telugu : మనందరికీ సాధారణంగా బ్రేక్​ఫాస్ట్ అంటే ఇడ్లీ, పూరీ, బోండా, వడ, దోశ.. వంటివి గుర్తుకొస్తాయి. వీటిల్లో దోశలకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. అయితే, ప్రతిసారీ క్రిస్పీ దోశలను(Dosa) తిని బోరింగ్​గా అనిపించొచ్చు. అందుకే ఈసారి మీకోసం ఒక సరికొత్త రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "పోహా దోశ". దీనినే స్పాంజ్ దోశ అని కూడా అంటారు. ఈ రెసిపీ మహారాష్ట్ర, బెంగళూరులలో చాలా ఫేమస్. పైగా దీనికోసం ఎక్కువ పడాల్సిన పనిలేదు. చాలా సింపుల్​గా తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్‌, ఐరన్‌ లాంటి పోషకాలు అందుతాయి. మరి, ఈ సూపర్‌ హెల్దీ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారుచేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • రెండు కప్పులు - బియ్యం
  • అరకప్పు - పోహా
  • ఒక స్పూను - మెంతులు
  • రెండు కప్పులు - పెరుగు
  • రుచికి సరిపడా - నెయ్యి
  • రుచికి తగినంత - ఉప్పు

పోహా దోశ తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బియ్యం, మెంతులను శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో వాటిని వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • అలాగే మరో బౌల్​లో అటుకులను కూడా బాగా కడిగి నానబెట్టుకోవాలి.
  • రెండు గంటల తర్వాత బియ్యం, మెంతుల మిశ్రమాన్ని వడకట్టి మిక్సీ జార్​లోకి వేసుకోవాలి. ఆపై కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చిక్కటి పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆవిధంగా పట్టుకునేటప్పుడు మధ్యలో నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మరో బౌల్​లోకి తీసుకొని.. పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి దోశ పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే, పిండి మరీ జారుడుగా కాకుండా కాస్త చిక్కగానే ఉండేట్లు చూసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని మందపాటి దోశలా వేసుకోవాలి. ఎందుకంటే.. మరీ పలుచగా వేసుకుంటే క్రిస్పీలా వచ్చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • కాబట్టి.. అట్టు మాదిరిగా దోశ వేసుకున్నాక దానిపై కొద్దిగా నెయ్యిని చల్లుకొని మీడియం సైజు మంటపై రెండువైపులా కాల్చుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా, మెత్తగా మృదువుగా ఉండే "స్పాంజ్ దోశ" రెడీ!
  • ఈ దోశల్ని కొబ్బరి చట్నీ/పల్లీల చట్నీ, సాంబార్‌తో కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ఈ పోహా దోశను ట్రై చేయండి!

ఇవీ చదవండి :

దోశలు క్రిస్పీగా రావడం లేదా? ఈ టిప్స్ పాటిస్తూ వేస్తే సూపర్​ క్రిస్పీతో పాటు టేస్ట్ అద్దిరిపోతాయి!

ఇడ్లీ/దోశ పిండి బాగా పులిసిపోయిందని పారేస్తున్నారా ? - ఇలా చేస్తే తాజాగా మారిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.