ETV Bharat / offbeat

ఘుమఘుమలాడే "ఆంధ్ర స్టైల్ పప్పుచారు" - ఇలా ప్రిపేర్ చేసుకోండి! - రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! - PAPPU CHARU RECIPE

మీకు పప్పుచారు అంటే చాలా ఇష్టమా?. కానీ, ఎన్నిసార్లు ట్రై చేసినా సరైన టేస్ట్ రావట్లేదా? అయితే, ఓసారి ఆంధ్రస్టైల్​లో ట్రై చేయండి. టేస్ట్ వేరే లెవల్​లో ఉంటుంది.

Andhra Style Pappu Charu
Pappu Charu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 10, 2024, 5:23 PM IST

How to Make Andhra Style Pappu Charu : ఎక్కువ మంది ఫేవరెట్ డిష్​లలో ఒకటి.. పప్పుచారు. అయితే, కొంతమందికి పప్పుచారును ఎన్నిసార్లు ప్రిపేర్ చేసుకున్నా.. ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంటుంది. టేస్ట్ అంత రుచికరంగా అనిపించదు. దీంతో పప్పుచారు బాలేదని ఫీల్​ అవుతుంటారు. అయితే అలా బాధపడేవారు ఈ పక్కా కొలతలతో ఓసారి ఆంధ్ర స్టైల్ పప్పుచారును ప్రిపేర్ చేసుకోండి. రుచి అద్దిరిపోతుంది! అంతేకాదు.. నచ్చితే ఎంచక్కా నేరుగానూ తాగేయొచ్చు. మరి, సూపర్ టేస్టీ పప్పుచారు తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • కందిపప్పు - 1 కప్పు(100 గ్రాములు)
  • చింతపండు - నిమ్మకాయ సైజంత
  • పసుపు - పావు టీస్పూన్
  • టమాటా - 1
  • ఉల్లిపాయ - 1(చిన్నది)
  • పచ్చిమిర్చి - 6
  • నూనె - 2 టీస్పూన్లు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - తగినంత
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తాలింపు కోసం :

  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • ఆవాలు - అర టీస్పూన్
  • జీలకర్ర - అర టీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • సన్నని ఉల్లిపాయ ముక్కలు - కొన్ని
  • ఇంగువ - అర టీస్పూన్
  • ఎండుమిర్చి - 3
  • కరివేపాకు - 2 రెమ్మలు

"మైసూర్​ స్టైల్​ టమాటా రసం" - రుచి అమోఘంగా ఉంటుంది! - ఇలా ప్రిపేర్ చేయండి!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా కుక్కర్​లో కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆపై అందులో మీరు పప్పు తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసుకొని అరగంటపాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది.
  • ఆలోపు మీరు మరో బౌల్​లో చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. అలాగే.. ఉల్లిపాయ, టమాటాను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని నిలువు చీలికలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అరగంట అయ్యాక.. కుక్కర్ మూత తీసి అందులో పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఆయిల్ వేసుకొని ఒకసారి అన్నింటినీ బాగా కలపాలి.
  • ఆ తర్వాత కుక్కర్ మూతపెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఆ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక.. కుక్కర్​లోని ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి పప్పుగుత్తితో పప్పును మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకులు ఉండేవిధంగా మాష్ చేసుకోవాలి.
  • అనంతరం అందులోకి ఉప్పు, కారం, నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
  • కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 6 నుంచి 7 నిమిషాల పాటు మిశ్రమాన్ని బాగా మరగనివ్వాలి.
  • ఆలోపు మీరు పప్పుచారు కోసం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మరో బర్నర్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. ముందుగా ఆవాలు, జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన 1 చిన్నసైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. పోపు కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకూ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం ఈ తాలింపును మరో బర్నర్ మీద మరిగించుకుంటున్న పప్పుచారులో పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • తర్వాత అందులో కొత్తిమీర తరుగు వేసుకొని రెండు నిమిషాల పాటు మరిగించుకొని దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "ఆంధ్ర స్టైల్ పప్పుచారు" రెడీ!

నిమిషాల్లో ప్రిపేర్​ అయ్యే 'పెసరపప్పు చారు'- ఇలా చేస్తే టేస్ట్​ నెక్ట్స్​ లెవల్​ అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.