ETV Bharat / offbeat

ఆరోగ్యానికి మేలు చేసే "మునగాకు ఫ్రై" - పదే పది నిమిషాల్లో చేసుకోండిలా! - టేస్ట్ అద్భుతం! - MUNAGAKU FRY

మునగాకుతో అద్దిరిపోయే రెసిపీ - ఇలా చేసి పెట్టారంటే ఎవరైనా వద్దనకుండా తినాల్సిందే!

HOW TO MAKE Munagaku Fry
Munagaku Fry Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2024, 8:34 PM IST

Munagaku Fry Recipe in Telugu : మనందరికీ ఆకుకూరలంటే.. తోటకూర, గోంగూర, పాలకూర వంటివే ముందుగా గుర్తుకొస్తాయి. వాటితో రకరకాల వంటకాలు ప్రిపేర్ చేసుకుంటుంటాం. అయితే, అవి మాత్రమే కాదు ఎన్నో పోషకాలను అందించే మునగాకుతో అద్దిరిపోయే రెసిపీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాంటి వాటిల్లో ఒకటే.. "మునగాకు ఫ్రై రెసిపీ". ఈ కర్రీ ఎంతో రుచికరంగా ఉండడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. పైగా దీన్ని చాలా సింపుల్​గా తక్కువ పదార్థాలతో నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు! ఇంతకీ, హెల్దీ అండ్ టేస్టీ ఈ మునగాకు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • మునగాకు - 3 కట్టలు(పెద్ద సైజ్​వి)
  • ఉల్లిపాయ - 1(పెద్ద సైజ్​ది)
  • పల్లీలు - 2 టేబుల్​స్పూన్లు
  • ఆయిల్ - 2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పోపు దినుసులు - 1 టేబుల్​స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • కరివేపాకు - 1 రెమ్మ
  • ఎండుమిర్చి - 6

మునగ ఆకులు కోసుకుంటే ఎవ్వరూ వద్దనరు! - చక్కగా "మునగాకు రోటి పచ్చడి" చేసుకోండి!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయను సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆపై అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు, కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్​ మీద వాటర్ ఇగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి.
  • అలా ఉడికించుకునేటప్పుడు మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ సుమారు ఐదు నిమిషాల పాటు మునగాకును బాగా ఉడికించుకోవాలి. ఆవిధంగా ఉడికించుకున్నాక పాన్​ని దింపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై మరో పాన్ పెట్టుకొని పల్లీలను వేయించుకొని చల్లారాక పొట్టు తీసుకోవాలి. అదే పాన్​లో ఎండుమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆపై కరివేపాకు, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆనియన్స్ కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకును వేసుకొని ఒక సారి బాగా కలుపుకోవాలి. ఆపై మీడియం ఫ్లేమ్​ మీద కలుపుతూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం రుచికి సరిపడా ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఓ 30 సెకన్ల పాటు కలుపుతూ వేయించుకొని స్టౌ ఆఫ్ చేసి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "మునగాకు ఫ్రై" రెడీ!
  • దీన్ని వేడివేడిగా అన్నంలో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఏదైనా పప్పు కర్రీ, పప్పుచారు వంటి వాటిలోకి సైడ్​ డిష్​గా సూపర్​గా ఉంటుంది! మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

గోళ్లు, జుట్టు సమస్యలకు చెక్ పెట్టే 'మునగాకు లడ్డు'!- మీరు ట్రై చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.