Mix These Two Ingredients in Henna to Change White Hair to Black: ప్రస్తుతం తెల్లజుట్టు చాలా మందికి సమస్యగా మారింది. వయసు, జెండర్‌తో సంబంధం లేకుండా అనేక మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ తెల్లజుట్టును కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే హెయిర్ డైలు కూడా వాడుతుంటారు. అయితే ఈ డైలు తాత్కాలికంగా జుట్టుకు నలుపును ఇచ్చినా క్రమంగా పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని అంటున్నారు. ఈ క్రమంలోనే జుట్టును సహజ పద్ధతులలో నల్లగా మార్చుకోవడానికి ఓ సూపర్ టిప్‌ను అందిస్తున్నారు కేశ సంరక్షణ నిపుణులు. హెన్నాలో కేవలం రెండు పదార్థాలు మిక్స్ చేసి జుట్టుకు రాస్తే.. హెయిర్ డై ఉపయోగించాల్సిన అవసరం ఉండదని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పసుపు: తెల్లజుట్టును నల్లగా మార్చడానికి పసుపు బాగా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. పసుపులో ఐరన్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి, నల్లగా మార్చడంలో సహాయపడతాయని వివరిస్తున్నారు. కేవలం నల్లగా మాత్రమే కాకుండా జుట్టుకు సహజ మెరుపు ఇవ్వడంలో కూడా ఇవి సహాయపడతాయని సూచిస్తున్నారు.
2018లో జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ సైన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం హెన్నా పొడిలో పసుపును మిక్సి చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల వాటిలోని పోషకాలు తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు సహాయపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ యూనివర్సిటీ(Rashtra Sant Tukadoji Maharaj Nagpur University)లో ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ Ravindra B. Gottam పాల్గొన్నారు.
ఉసిరి పొడి: ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉసిరిపొడిని జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు అనేక రకాలుగా మేలు చేస్తాయని.. ముఖ్యంగా చుండ్రు నివారించడం, జుట్టు రాలడాన్ని తగ్గించడం, జుట్టుకు సహజ రంగును అందించడం చేస్తాయని అంటున్నారు. కాబట్టి ఉసిరికాయను, పసుపును హెన్నా పొడిలో కలిపి జుట్టుకు అప్లై చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుందని చెబుతున్నారు.
బిగ్ అలర్ట్ : జుట్టుకు రంగు వేస్తున్నారా? - ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలుసా?
ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలంటే: పసుపు, ఉసిరికాయ పొడిని హెన్నా పొడిలో నేరుగా మిక్స్ చేయకూడదు. ఎలా వాడాలాంటే..
- స్టవ్ ఆన్ చేసి ఐరన్ బాండీ పెట్టి అందులో ఒక చెంచా పసుపు, రెండు చెంచాల ఉసిరికాయ పొడి వేసి బాగా వేయించాలి. ఉసిరికాయ పొడి, పసుపు రెండూ నల్లగా మారేవరకు వేయించిన తరువాత స్టౌ ఆఫ్ చేసి అది చల్లారే వరకు దాన్ని ఒకవైపు ఉంచాలి.
- జుట్టు పరిమాణాన్ని బట్టి అవసరమైనంత హెన్నా పొడిని తీసుకుని అందులో వేయించుకున్న పసుపు, ఉసిరికాయ మిశ్రమం, అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. దీంతో నేచురల్ హెయిర్ డై ప్రిపేర్ అయినట్లే.
- తయారుచేసుకున్న నేచురల్ హెయిర్ డై ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల పాటూ అలాగే ఉంచాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
- ఈ హెయిర్ డై ను వారానికి రెండు సార్లు ఉపయోగిస్తుంటే తొందరలోనే తెల్లజుట్టు పూర్తీగా నల్లగా మారుతుందని అంటున్నారు. అంతేకాదు మంచి మెరుపు కూడా ఉంటుందని చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సీడ్స్ ట్రై చేస్తే నల్లగా మారడం పక్కా!
20ఏళ్లకే జుట్టు తెల్లబడుతోందా.. అలాంటి షాంపూల వల్లే! ఈ జాగ్రత్తలు మస్ట్!!