ETV Bharat / offbeat

నోరూరించే "మినపప్పు టమాట పచ్చడి" - వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అద్భుతమే!​

మినపప్పుతో టిఫెన్స్​ మాత్రమే కాదు పచ్చడి కూడా అద్భుతం ఈ పద్ధతిలో చేస్తే అన్నం, దోశకు సూపర్​ కాంబినేషన్​

URAD DAL TOMATO PACHADI
How to Make Minapappu Tomato Pachaadi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 3:17 PM IST

How to Make Minapappu Tomato Pachaadi: మినపప్పు.. ప్రతీ వంటింట్లోని పోపుల డబ్బాలో ఉండేదే. అంతేనా.. ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ బ్రేక్​ఫాస్ట్​ ప్రిపేర్​ చేయలన్నా ఇది కావాలి. కేవలం టిఫెన్స్​ మాత్రమే కాదు.. పిల్లల లంచ్​ బాక్స్​లోకి సరిపడే విధంగా మినపప్పుతో ఫ్రైడ్​ రైస్​ను చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న మినపప్పుతో.. అద్దిరిపోయే పచ్చడి కూడా చేసుకోవచ్చంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మాలి. మినపప్పు, టమాట కలిపి రోటీ పచ్చడి చేస్తే ఆ వాసనకే కడుపు నిండిపోతుంది. ఇక తింటే ఆ టేస్ట్​ గురించి చెప్పక్కర్లేదు. ఈ పద్ధతిలో తయారు చేసిన పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకుని కూసింత నెయ్యి కలిపి తింటే అమృతమే. మరి ఇంత టేస్టీ మినపప్పు పచ్చడిని ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • నూనె - సరిపడా
  • మినపప్పు - అర కప్పు
  • ధనియాలు - 2 టీ స్పూన్లు
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • ఎండు మిర్చి -15
  • మెంతులు - చిటికెడు
  • టమాటలు - 3
  • చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంతా
  • ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం:

  • నూనె - 2 టీ స్పూన్లు
  • పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్​
  • ఆవాలు- 1 టీ స్పూన్​
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • దంచిన వెల్లుల్లి రెబ్బలు - 5
  • ఎండు మిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:

  • ముందుగా టమాటలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి సిమ్​లో పెట్టి పాన్ పెట్టి రెండు టేబుల్​ స్పూన్ల నూనె పోసుకోవాలి.
  • నూనె కొద్దిగా హీట్​ అయిన తర్వాత మినపప్పు వేసుకుని దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
  • మినపప్పు కలర్​ మారుతున్నప్పుడు ధనియాలు, జీలకర్ర వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఎండు మిర్చిని తుంపి వేసుకువాలి. ఇలా తుంచి వేసుకుంటే మిరపకాయలు లోపల వరకు వేగి టేస్ట్​ బాగుంటుంది. మెంతులు కూడా వేసుకుని వేయించుకోవాలి.
  • అన్ని పదార్థాలు వేగిన తర్వాత ఓ ప్లేట్​లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో మరికొద్దిగా నూనె వేసి టమాట ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మంటను సిమ్​లో పెట్టి మెత్తగా ఉడకించాలి.
  • టమాట ముక్కలు ఉడికిన తర్వాత పక్కకు పెట్టి చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు.. ముందే వేయించుకున్న మినపప్పు మిశ్రమాన్ని మిక్సీజార్​లోకి వేసుకుని కొద్దిగా బరకగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి ఉడికించిన టమాట ముక్కలు వేసి మళ్లీ గ్రైండ్​ చేసుకోవాలి. అయితే ఇక్కడ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి.
  • ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
  • ఈ తాలింపు మిశ్రమాన్ని పచ్చడిలో కలుపుకుంటే.. ఎంతో రుచికరంగా ఉండే మినపప్పు టమాట పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తింటే రుచి అద్దిరిపోవాల్సిందే. మరి నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.

సొరకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

రొటీన్​ కూరలు తిని నోరు చప్పగా తయారైందా? - ఇలా "పచ్చిమిర్చి బండ పచ్చడి" ట్రై చేయండి - చాలా టేస్టీ!

మునగ ఆకులు కోసుకుంటే ఎవ్వరూ వద్దనరు! - చక్కగా "మునగాకు రోటి పచ్చడి" చేసుకోండి! - నోటికి అమృతం, ఆరోగ్యానికి దివ్య ఔషధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.