ETV Bharat / offbeat

'నా నగలు వీళ్లు తాకట్టు పెట్టారు - వాటిని మా పుట్టింటి వాళ్లు విడిపించాలట!' - ఏం చేయాలి? - LEGAL ADVICE ON DOWRY IN TELUGU

- న్యాయ నిపుణుల సలహా కోరుతున్న వివాహిత - అత్తవారింట్లో వేధింపులు తాళలేకపోతున్నానని ఆవేదన

Legal Advice on Dowry
Legal Advice on Dowry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 10:06 AM IST

Legal Advice on Dowry : ఎన్నో ఏళ్లుగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలలో వరకట్నం ఒకటి. ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా.. చాలా పేద, మధ్యతరగతి కుటుంబాలను ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. కట్నం వేధింపులతో నేటికీ ఏదో ఒక చోట మహిళలు బలవుతూనే ఉన్నారు. అయితే, కట్నం వేధింపులతో ఇబ్బంది పడుతున్న ఓ మహిళ న్యాయ నిపుణుల సలహా కోరుతున్నారు. ఇంతకీ ఆమె సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇదీ సమస్య..

నా పెళ్లి సమయంలో మా వాళ్లు రూ.25 లక్షల నగదు, 50 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. పెళ్లై ఏడాదైనా కాకుండానే నా ప్రమేయం లేకుండా.. నగలను బ్యాంకులో తాకట్టు పెట్టారు. ఆ ఆభరణాలు మా అమ్మమ్మ నుంచి వారసత్వంగా వచ్చినవి. వచ్చే నెలలో మా చెల్లి పెళ్లి ఉంది. ఆ పెళ్లి సమయానికైనా విడిపించమని ఎంతో బతిమిలాడాను. 'నగలు వేసుకోకపోతే ఏమవుతుంది? మీ పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి తీసుకో' అని అంటున్నారు. అసలు నా నగల్ని తీసుకునే హక్కు వారికి ఉంటుందా? ఈ వివాహ బంధంలో ఎక్కువ రోజులు ఉండలేననిపిస్తోంది. నేనేం చేయాలి? అని ఓ మహిళ అడుగుతున్నారు. మరి.. ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది 'జి. వరలక్ష్మి' ఎలాంటి ఆన్సర్​ ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

1961లో వరకట్న నిషేధచట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం.. కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. పెళ్లప్పుడు ఇచ్చిన నగలు, డబ్బు, ఆస్తులు అన్నీ కట్నం కిందకే వస్తాయి. వరకట్న నిషేధ చట్టానికి 1986లో కొన్ని మార్పులు చేశారు. మార్పుల ప్రకారం.. కనీస శిక్షగా ఐదేళ్ల జైలు, 25 వేల రూపాయల జరిమానా నిర్ణయించారు. అంతేకాదు.. ఇది నాన్ బెయిలబుల్ నేరంగా మార్చారు.

"వరకట్న నిషేధం కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ ఇంకా.. కట్నం బాధలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం.. కట్నంగా ఇచ్చిన నగదు, ఆస్తిని మూడు నెలల్లోగా ఆ వధువు పేరు మీదకు బదిలీ చేయాలి. అలా చేయకపోతే.. 6 నెలల నుంచి రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది."- జి. వరలక్ష్మి (న్యాయవాది)

ఎన్నేళ్లయినా కట్నం తెమ్మని అడగడం నేరమే..

చట్ట ప్రకారం.. వధువుకి చెందిన ఆస్తి ఆమె వారసులకు (చనిపోయాక) చెందుతుంది. ఒకవేళ ఆమెకు వారసులు లేకుండా మరణిస్తే తిరిగి తన పేరెంట్స్​కే వెళ్తుంది. కట్నం తెమ్మని పదేపదే అడగడం, తేలేదని వేధించడం నేరం. పెళ్లై ఎన్నేళ్లు గడిచినా కూడా అది నేరమే అవుతుంది.

ఇలా చేయండి..

ముందు వరకట్న వేధింపులకింద, గృహహింస చట్టం కింద కేసు ఫైల్​ చేయండి. ఒకవేళ డివోర్స్ తీసుకునేట్లయితే మీకు కట్నంగా ఇచ్చిన డబ్బు, నగలు, వస్తువులు అన్నీ తిరిగి ఇమ్మని అడగండి. క్రిమినల్‌ కేసు పెడితే నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిదే అవుతుంది. ముందుగా ఈ సంసార బంధంలో ఉండాలా? అక్కర్లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. ఆ తర్వాత కేసు విషయమై ముందుకు వెళ్లండి. ఒకవేళ కలిసే ఉండాలనుకుంటే ముందు మధ్యవర్తులతో మాట్లాడించి సమస్యను పరిష్కరించుకోవాలని జి. వరలక్ష్మి సూచిస్తున్నారు.

Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

పాపం.. భర్త చనిపోయాడు - అత్తగారు రాసిచ్చిన భూమిని అడ్డుకుంటున్నారు! - న్యాయ నిపుణుల సమాధానం ఇదే

'మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు - వారికి రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చా?' - న్యాయ నిపుణుల సమాధానం ఇదే! -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.