ETV Bharat / offbeat

పదే పది నిమిషాల్లో - పసందైన "పచ్చికొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి" - టేస్ట్ వేరే లెవల్ అంతే! - Pachi Kobbari Pachi Mirchi Pachadi

Pachi Kobbari Pachi Mirchi Pachadi : మార్నింగ్ టిఫెన్స్​లోకి ఎప్పుడూ రొటీన్​గా పల్లీ చట్నీ, అల్లం పచ్చడి, టమాటా పచ్చడి తినడం బోరింగ్​గా అనిపిస్తోందా? అయితే, మీకోసం ఒక అద్దిరిపోయే రెసిపీ పట్టుకొచ్చాం. అదే.. పచ్చికొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి. టేస్ట్ భలే ఉంటుంది! ఇంతకీ.. ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Kobbari Pachi Mirchi Pachadi
Pachi Kobbari Pachi Mirchi Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 20, 2024, 5:29 PM IST

How to Make Pachi Kobbari Pachi Mirchi Pachadi : చాలా మంది మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​ ఐటమ్స్​లోకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి వంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అయితే.. ఎప్పుడూ అవేకాకుండా ఈసారి కాస్త డిఫరెంట్​గా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే.. మీకోసం ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. 'పచ్చికొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి'. చాలా తక్కువ పదార్థాలతో పదే పది నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీని టిఫెన్స్​లోనే కాదు అన్నంలో తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. మరి, ఈ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • నూనె - 2 టీస్పూన్లు
  • ధనియాలు - అర టీస్పూన్
  • మెంతులు - పావు టీస్పూన్
  • జీలకర్ర - పావు టీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 8(పెద్దవి)
  • పచ్చికొబ్బరి - అరచిప్ప
  • చింతపండు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి తగినంత

తాలింపుకోసం :

  • నూనె - 1 టీస్పూన్
  • ఆవాలు - అర టీస్పూన్
  • మినప పప్పు - అర టీస్పూన్
  • కరివేపాకు - 1 రెమ్మ
  • ఎండుమిర్చి - 2

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా పచ్చికొబ్బరిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే.. ఉల్లిపాయను తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై.. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఆనియన్స్ కాస్త మెత్తబడే వరకు ఆ మిశ్రమాన్ని వేయించుకోవాలి.
  • ఆ విధంగా వేయించుకున్నాక.. ఆ మిశ్రమంలో పచ్చిమిర్చిని మధ్యలోకి తుంపి వేసుకొని కలుపుతూ మరికాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలనూ అందులో వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి కొబ్బరి ముక్కలు ఎర్రగా మారే వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత కాస్త చింతపండును కూడా ఆ మిశ్రమంలో వేసుకొని అరనిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది.
  • అలా వేయించుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్​లోకి తీసుకోవాలి.
  • ముందుగా ఒకసారి వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్నాక.. ఉప్పు, తగినన్ని వాటర్ వేసుకొని మరీ మెత్తగా, కచ్చాపచ్చాగా కాకుండా గ్రైండ్ చేసుకొని తాళింపు పెట్టుకోవాలి.
  • తాళింపు కోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఆవాలు, మినప పప్పు, కరివేపాకు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • తర్వాత ఆ తాలింపుని ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పచ్చడిలో వేసి కలుపుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే పసందైన "పచ్చికొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి" రెడీ!
  • ఈ పచ్చడిని తాళింపు పెట్టుకోకుండా తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది.

ఇవీ చదవండి :

టిఫెన్ సెంటర్ రుచిలో "అల్లం చట్నీ" - పదే పది నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి!

పల్లీ చట్నీ అందరూ చేస్తారు - కానీ హోటల్​ టేస్ట్ మాత్రం రాదు! - ఈ టిప్స్ పాటిస్తే అద్భుతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.