ETV Bharat / offbeat

షుగర్ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినొచ్చు! - దసరాకి "జొన్న మురుకులు" చేసుకోండిలా - JONNA MURUKULU RECIPE

చాలా మంది ఇష్టపడే పిండి వంటకాల​లో ఒకటి.. మురుకులు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా దసరా పండక్కి కాస్త వెరైటీగా 'జొన్న మురుకులు' ట్రై చేయండి. మరి, వీటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

JONNA MURUKULU RECIPE
Jonna Pindi Jantikalu (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 9, 2024, 1:44 PM IST

How to Make Jonna Pindi Jantikalu : దసరా వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే అందరూ రకరకాల పిండి వంటకాలను తయారు చేయడానికి సిద్ధమైపోతుంటారు. అందులో మెజార్టీ పీపుల్ చేసుకునే వాటిల్లో జంతికలు/మురుకులు ప్రధానంగా ఉంటాయి. ఎంతో మంది వీటిని ఎన్నో రకాలుగా చేస్తారు. బియ్యప్పిండి, మినప్పిండి, పెసరప్పిండి.. ఇలా చాలా వెరైటీలు ఉంటాయి. కానీ, ఈసారి కాస్త కొత్తగా "జొన్న మురుకులను" ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉండడమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్‌తో(Diabetes) బాధపడేవారికి ఇవెంతో ఉపశమనం కలిగిస్తాయి. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ, హెల్దీ జొన్న మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • జొన్న పండి - మూడు కప్పులు
  • నువ్వులు - అర కప్పు
  • పల్లీలు - ఒక కప్పు
  • వాము - ఒక టేబుల్ స్పూన్
  • వెన్న - రెండు చెంచాలు
  • పచ్చిమిర్చి - 4
  • నూనె - వేయించడానికి సరిపడినంత

తిన్నాకొద్దీ తినాలనిపించే టేస్టీ "పప్పు చెక్కలు" - పిండి కలపడంలోనే సీక్రెట్ అంతా!

తయారీ విధానం :

  • ముందుగా రెసిపీలోకి కావాల్సిన పల్లీల పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌ పైన్ పాన్ పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి.
  • ఆపై వేయించుకున్న పల్లీలను పొట్టు తీసి మిక్సీ జార్​లో వేసుకొని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే.. పచ్చిమిర్చిని కట్ చేసుకొని పేస్ట్​లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్​ తీసుకొని అందులో జొన్న పిండి, నువ్వులు, మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పల్లీల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, వాము, ఉప్పు, బటర్ వేసి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యేలోపు.. మురుకుల గొట్టంలో కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి.
  • తర్వాత ముందుగా కలిపిపెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిముద్దను తీసుకొని మురుకుల గొట్టంలో తీసుకోవాలి.
  • అనంతరం వేడిగా ఉన్న నూనెలో మీకు నచ్చిన ఆకారంలో మురుకుల పిండిని వత్తుకోవాలి.
  • లేకపోతే.. చిల్లుల గరిటె తీసుకొని దాని మీద మీకు కావాల్సిన షేప్​లో పిండిని వత్తుకొని ఆపై వాటిని కాగే ఆయిల్​లో వేసి ఫ్రై చేసుకోవచ్చు.
  • జంతికలను రెండు వైపులా గోల్డెన్​ కలర్​లో కాల్చుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి. ఈవిధంగానే పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే.. కరకరలాడే "జొన్నపిండి జంతికలు" రెడీ!
  • ఈ మురుకులు చాలా రుచికరంగా ఉండడమే కాదు.. నూనె(Oil) కూడా ఎక్కువగా పీల్చవు.
  • మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ దసరాకి ఒకసారి జొన్న మురుకులను ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఆస్వాదించండి.

దసరా స్పెషల్ : జంతికలు చేస్తున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే సూపర్ టేస్టీగా కరకరలాడిపోతాయ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.