ETV Bharat / offbeat

సింగపూర్​ వెళ్తారా? - తక్కువ ధరలోనే IRCTC సూపర్​ ప్యాకేజీ - మలేసియా కూడా చుట్టేయొచ్చు! - IRCTC Malaysia and Singapore Tour - IRCTC MALAYSIA AND SINGAPORE TOUR

IRCTC Malaysia and Singapore Tour : తక్కువ ఖర్చుతో విదేశాలకు ఎగిరిపోవాలని ఉందా? అక్కడ పర్యాటక ప్రదేశాలను విజిట్​ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC Malaysia and Singapore Tour
IRCTC Malaysia and Singapore Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2024, 9:54 AM IST

IRCTC Magical Malaysia With Singapore Sensation: ప్రపంచ బెస్ట్​ టూర్టిస్ట్ స్పాట్‌గా సింగపూర్ విరాజిల్లుతోంది. విశాలమైన జూలాజికల్ గార్డెన్స్, ఉద్యానవనాలకు నిలయంగా ఉంది. దీంతో నిత్యం వేల మంది పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు. మరి మీరు అక్కడికి వెళ్లే ప్లాన్​లో ఉన్నారా? కానీ ఎలా వెళ్లాలో తెలియడం లేదా? నో వర్రీ. సింగపూర్, మలేసియా వంటి ఆగ్నేయాసియా దేశాలను తక్కువ ఖర్చుతో చుట్టేసి రావాలనుకుంటున్న వారి కోసం ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజుల? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మ్యాజికల్​ మలేసియా విత్​ సింగపూర్​ సెన్సేషన్​(Magical Malaysia With Singapore Sensation) పేరుతో ఐఆర్​సీటీసీ ప్యాకేజీ ఆపరేట్​ చేస్తోంది. ఈ టూర్​ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు కొనసాగనుంది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు. ప్రయాణ వివరాలు చూస్తే..

మొదటి రోజు రాజీవ్​ గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ నుంచి అర్ధరాత్రి 12:30 ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. అదే రోజు ఉదయం 7:30 గంటలకు కౌలాలంపూర్​కు రీచ్​ అవుతారు. అక్కడ ఫార్మాలిటీస్​ పూర్తయిన తర్వాత ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. చెకిన్​ అయిన తర్వాత బ్రేక్​ఫాస్ట్​ తర్వాత మధ్యాహ్నం వరకు రెస్ట్​ తీసుకుంటారు. లంచ్​ తర్వాత పుత్రజయ విజిట్​ చేసి, షాపింగ్ చేసుకోవచ్చు. ఆ రాత్రికి డిన్నర్​ ఇండియన్​ రెస్టరెంట్​లో ఉంటుంది. అలాగే ఆ రాత్రికి అక్కడే స్టే చేయాలి.

రెండో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత బటు కేవ్స్​ విజిట్​ చేస్తారు. ఆ తర్వాత జెంటింగ్ హైలాండ్స్ సందర్శించి తిరిగి కౌలాలంపూర్​కు చేరుకుంటారు. ఆ రాత్రికి కూడా అక్కడే స్టే చేయాలి.

IRCTC నార్త్ ఇండియా టూర్​ - మాతా వైష్ణోదేవి ఆలయంతోపాటు మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు!

మూడో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత కౌలాలంపూర్ నగర పర్యటనకు వెళ్తారు. ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాన్యుమెంట్ విజిట్​ చేస్తారు. ఆ తర్వాత పెట్రోనాస్ ట్విన్ టవర్ (స్కై బ్రిడ్జ్ ఎంట్రీ) సందర్శిస్తారు. లంచ్​ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్​ చేస్తారు. బెర్జియా టైమ్స్ స్క్వేర్​లో షాపింగ్​ చేసుకోవచ్చు. ఆ రాత్రికి కౌలాలంపూర్​లో డిన్నర్​ చేసి అక్కడే బస చేస్తారు.

నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత సింగపూర్​కు బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత బే గార్డెన్స్ విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి డిన్నర్​ చేసి సింగపూర్​లో స్టే చేయాలి.

ఐదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత సింగపూర్​ సిటీ టూర్​ ఉంటుంది. ఆర్చిడ్ గార్డెన్, మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్ వీక్షిస్తారు. లంచ్​ తర్వాత వన్ వే కేబుల్ కార్ రైడ్, మేడమ్ టుస్సాడ్స్, వింగ్స్ ఆఫ్ టైమ్ విజిట్​ చేస్తారు. డిన్నర్​ తర్వాత సింగపూర్​ హోటల్​లో బస చేయాలి.

ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత యూనివర్సల్​ స్టూడియోస్​ విజిట్​ చేస్తారు. సాయంత్రానికి తిరిగి హోటల్​కు చేరుకుని డిన్నర్​ కంప్లీట్​ చేసి స్టే చేస్తారు.

ఏడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత చెక్​ అవుట్​ చేసి జురాంగ్ బర్డ్ పార్క్ సందర్శిస్తారు. లంచ్​ తర్వాత చాంగి విమానాశ్రయానికి రీచ్​ అవుతారు. అక్కడి నుంచి కౌలాలంపూర్​ మీదుగా హైదరాబాద్​కు చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ధర వివరాలు చూస్తే:

  • కంఫర్ట్​లో.. సింగిల్​లో షేరింగ్​కు రూ. 1,56,030, డబుల్​ షేరింగ్​కు రూ. 1,29,280, ట్రిపుల్​ షేరింగ్​కు రూ. 1,28,720 చెల్లించాలి.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 1,11,860 పే చేయాలి.
  • 2 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ. 98.820

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్లు(హైదరాబాద్​ - కౌలాలంపూర్​/ సింగపూర్​ - హైదరాబాద్​)
  • హోటల్​ అకామిడేషన్​
  • 7 బ్రేక్​ఫాస్ట్​లు, 7 లంచ్​లు, 6 డిన్నర్​లు ప్రొవైడ్​ చేస్తారు.
  • టూర్​ పూర్తయ్యే వరకు గైడ్​ అందుబాటులో ఉంటారు.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్​ 28వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​ పై క్లిక్​ చేయండి.

ఐఆర్​సీటీసీ కేరళ టూర్​ - ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు! ధర చాలా తక్కువ!

హైదరాబాద్​ టూ వయనాడ్​ - అతి తక్కువ ధరకే ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ!

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.