ETV Bharat / offbeat

ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ - ఆరు రోజుల పాటు మేఘాలయ, అస్సాం అందాలు చూడొచ్చు!

-ఫ్లైట్​ జర్నీ ద్వారా హైదరాబాద్​ నుంచి టూర్​ -అందుబాటు ధరలోనే ప్యాకేజీ

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

IRCTC Packages
IRCTC Mesmerizing Meghalaya and Assam (ETV Bharat)

IRCTC Mesmerizing Meghalaya and Assam : ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి.. కూల్ ప్లేస్​లో ఎంజాయ్ చేయాలనుకునేవారికి.. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో జ్ఞాపకాలను పోగేసుకునేందుకు సూపర్​ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రశాంతమైన, సుందరమైన, ఉత్కంఠ భరితమైన ప్రదేశాలు చూడాలని భావించే వారు ఈ టూర్‌కు వెళ్లొచ్చు. మరి ఈ టూర్​ ఎప్పుడు? ఎన్ని రోజులు సాగుతుంది? ఏఏ ప్రదేశాలు కవర్​ చేయొచ్చు? ధర ఎంత? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఐఆర్‌సీటీసీ మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. మీరు ఈ టూర్‌లో భాగంగా షిల్లాంగ్, చిరపుంజి, గువాహటి వంటి ప్రాంతాలను చుట్టేసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. మెుత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఫుల్​గా ఎంజాయ్ చేయొచ్చు.

ప్రయాణ వివరాలు చూస్తే..

మొదటి రోజు హైదరాబాద్‌ నుంచి టూర్​ ప్రారంభం అవుతుంది. ఉదయం 9:25 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నానికి గువాహటి చేరుకుంటారు. అక్కడ ఎయిర్​పోర్ట్​లో పికప్​ చేసుకుని షిల్లాంగ్ తీసుకెళ్తారు. షిల్లాంగ్ చేరుకున్న తర్వాత లోకల్ మార్కెట్ సందర్శించొచ్చు. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి.

రెండో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్ తర్వాత చిరపుంజి ట్రిప్ ఉంటుంది. అక్కడ ఎలిఫాంటా ఫాల్స్, వ్యూ పాయింట్​, నోహ్కలికై జలపాతం, మావ్స్మై గుహలు, సెవన్​ సిస్టర్​ వాటర్​ఫాల్స్​ విజిట్​ చేయొచ్చు. రాత్రికి తిరిగి షిల్లాంగ్​ చేరుకుని అక్కడే బస చేస్తారు.

మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత దావ్కీ లేక్ విజిట్​ చేస్తారు. ఆ తర్వాత మావ్లిన్‌నాంగ్, లివింగ్ రూట్ బ్రిడ్జ్ సందర్శిస్తారు. సాయంత్రానికి షిల్లాంగ్​ చేరుకుని ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.

సింగపూర్​ వెళ్తారా? - తక్కువ ధరలోనే IRCTC సూపర్​ ప్యాకేజీ - మలేసియా కూడా చుట్టేయొచ్చు!

నాలుగో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత కజరంగి బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఐదో రోజు తెల్లవారుజామున సఫారికి వెళ్తారు. ఆ తర్వాత హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ చేసి చెక్​ అవుట్​ అయ్యి గువాహటి బయలుదేరుతారు. అక్కడ సమయం కుదిరితే బ్రహ్మపుత్ర రివర్​ను విజిట్​ చేస్తారు. ఆ తర్వాత హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత చెక్​ అవుట్​ అయ్యి కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత గువాహటి ఎయిర్​పోర్ట్​లో డ్రాప్​ చేస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్​ రావడంతో టూర్​ పూర్తవుతుంది.

ధర వివరాలు చూస్తే:

  • కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.53,250, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.46,500, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ. 44,750 చెల్లించాలి.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 40,650, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.36,650 చెల్లించాలి.
  • 2 నుంచి 4 సంవత్సరాల చిన్నారులకు విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.30,500 పే చేయాలి.

ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్లు(హైదరాబాద్​ - గువాహటి- హైదరాబాద్​)
  • హోటల్​ అకామిడేషన్​
  • 5 బ్రేక్​ఫాస్ట్​లు, 5 డిన్నర్​లు
  • లోకల్​ ట్రాన్స్​పోర్ట్​ కోసం వెహికల్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ 7వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి..

అల "ఊటీ అందాల్లో" విహరించండి? - తక్కువ ధరకే ఆరు రోజుల పాటు IRCTC ప్యాకేజీ! - వివరాలివే!

హైదరాబాద్​ to అండమాన్ - ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ - ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.