ETV Bharat / offbeat

కార్తికమాసంలో జ్యోతిర్లింగాలు దర్శించుకునేందుకు వీలుగా - IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర తక్కువే! - IRCTC MADHYA PRADESH MAHA DARSHAN

-మధ్యప్రదేశ్​లోని రెండు జ్యోతిర్లింగాలు దర్శించుకోవచ్చు -హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా టూర్​

IRCTC Madhya Pradesh Maha Darshan Tour
IRCTC Madhya Pradesh Maha Darshan Tour (Eఊన Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 3:59 PM IST

IRCTC Madhya Pradesh Maha Darshan Tour: మరికొన్ని రోజుల్లో కార్తికమాసం రానుంది. ఈ క్రమంలో చాలా మంది శివాలయాలను దర్శించుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని భావిస్తారు. మరి మీరు కూడా ఆ లిస్ట్​లో ఉన్నారా? అయితే మీకో సూపర్​ ​న్యూస్​ చెబుతోంది ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్(IRCTC)​. కార్తికమాసంలో మధ్యప్రదేశ్​లోని రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు వీలుగా ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ఆ ప్యాకేజీ అంటే ఏమిటి? ఎన్ని రోజులు ఉంటుంది? ధర ఎంత? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

IRCTC 'మధ్యప్రదేశ్‌ మహా దర్శన్​' (Madhya Pradesh Maha Darshan) పేరుతో ఈ టూర్​ నిర్వహిస్తోంది. ఈ టూర్​ మొత్తం 4 రాత్రులు, 5 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ ద్వారా ఈ టూర్​ స్టార్ట్​ అవుతుంది. ఈ టూర్​లో భాగంగా మహేశ్వర్​, ఓంకారేశ్వర్​, ఉజ్జయిని, ఇందౌర్​ వంటి ప్రదేశాలను విజిట్​ చేయవచ్చు. మరి ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు మధ్యాహ్నం 2:35 గంటలకు హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. నాలుగు గంటలకు ఇందౌర్​ చేరుకుంటారు. అక్కడి నుంచి ఉజ్జయిని బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి మహకాళేశ్వర్​ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ రాత్రికి ఉజ్జయినిలోనే బస చేయాలి.
  • రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత ఉజ్జయినిలోని లోకల్​ టెంపుల్స్​(కాళభైరవ ఆలయం, సాందీపని ఆశ్రమం, మంగళనాథ్​ టెంపుల్​, చింతామన్​ గణేష్​ టెంపుల్​, హర్​సిద్ధి మాతా టెంపుల్​) దర్శించుకోవాలి. సాయంత్రం అక్కడ పలు ప్రదేశాలను చూసుకోవచ్చు. ఆ రాత్రికీ ఉజ్జయినిలోనే స్టే చేయాలి.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత చెక్​ అవుట్​ అయ్యి మహేశ్వర్​ బయలుదేరుతారు. అక్కడ అహిల్యా దేవి ఫోర్ట్​, నర్మదా ఘాట్​ సందర్శించుకోవాలి. ఆ తర్వాత ఓంకారేశ్వర్​ బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే స్టే చేయాలి.
  • నాలుగో రోజు తెల్లవారుజామున ఓంకారేశ్వర ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత బ్రేక్​ఫాస్ట్​ ఉంటుంది. అనంతరం చెక్​ అవుట్​ అయ్యి ఇందౌర్​కి స్టార్ట్​ అవుతారు. అక్కడ పీఠేశ్వర్ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవాలి. అనంతరం హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే డిన్నర్​ చేసి బస చేయాలి.
  • ఐదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి అన్నపూర్ణ మందిర్​, లాల్​బాగ్​ ప్యాలెస్​. మధ్యలో లంచ్​ ఉంటుంది. సాయంత్రానికి ఇందౌర్​ ఎయిర్​పోర్ట్​లో డ్రాప్​ చేస్తారు. సాయంత్రం 6:35 గంటలకు హైదరాబాద్​కు రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. రాత్రికి సిటీ చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ధర వివరాలు:

  • కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.35,450, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.28,950, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.27,900గా చెల్లించాలి.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.25,750, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.21,450 పే చేయాలి.
  • 2 నుంచి 4 సంవత్సరాల విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.18,950 చెల్లించాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్లు(హైదరాబాద్​ - ఇందౌర్​ - హైదరాబాద్​)
  • హోటల్​ అకామిడేషన్​
  • 4 బ్రేక్​ఫాస్ట్​లు, 4 డిన్నర్​లు ఉంటాయి.
  • సైట్​ సీయింగ్​ కోసం ఏసీ టెంపో ట్రావెలర్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ 6, 20వ తేదీల్లో అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ To శ్రీలంక - రామాయణ ఇతిహాసాలు చూసేందుకు - IRCTC సూపర్​ ప్యాకేజీ!

అటు ఆధ్యాత్మిక దర్శనాలు - ఇటు పర్యాటక ప్రదేశాలు - IRCTC అద్భుత ప్యాకేజీ! ధర కూడా తక్కువేనండోయ్​!

IRCTC దిల్లీ టూర్ - కృష్ణ జన్మభూమి మథురతోపాటు, మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.