ETV Bharat / offbeat

హైదరాబాద్​ to కాశీ - కేవలం రూ.15 వేలకే ఆరు రోజుల టూర్! - IRCTC Jai Kashi Viswanath Gange

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 10:51 AM IST

IRCTC Tour Packages : ముఖ్యమైన ఆలయాలను దర్శించుకునేందుకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. దైవదర్శనానికి.. అందుబాటులో ధరల్లోనే ప్యాకేజీలు ఆపరేట్​ చేస్తోంది. తాజాగా మరో ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి వారణాసికి సాగే ఈ టూర్​ కేవలం 15 వేలకే అందుబాటులో ఉంది! పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

IRCTC Packages
IRCTC Packages (ETV Bharat)

IRCTC Jai Kashi Viswanath Gange Tour Package: హైదరాబాద్​ నుంచి కాశీకి IRCTC సూపర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్​లో ప్రయాగ్ రాజ్, సారనాథ్​, వారణాసి ప్రాంతాలను సందర్శించవచ్చు. మొత్తంగా 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్​ జర్నీ ద్వారా ఈ ప్యాకేజ్​ను ఆపరేట్​ చేస్తున్నారు.

ప్రయాణం ఇలా ఉంటుంది:

  • మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9.25 గంటలకు ట్రైన్​ జర్నీ(ట్రైన్​ నెం 12791) స్టార్ట్​ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటల వారణాసి రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు.
  • అక్కడ చెకిన్ అయిన తర్వాత.. సాయంత్రం గంగా హారతి ఉంటుంది. ఆ రాత్రికి వారణాసిలోనే బస చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత వారణాసిలో కాశీ విశ్వనాథ్ మందిర్, కాల భైరవ మందిర్, బీహెచ్​యూ మందిర్​లను సందర్శిస్తారు. సమయం లభిస్తే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ రాత్రి వారణాసిలోనే ఉంటారు.
  • నాలుగో రోజు అల్పహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత సారనాథ్ వెళ్తారు. అక్కడ పలు ప్లేసెస్​ విజిట్​ చేసిన తర్వాత అక్కడ నుంచి ప్రయాగ్​​రాజ్​కు వెళ్తారు. మార్గమధ్యంలో వింద్యాచల్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. రాత్రి వరకు ప్రయాగ్​రాజ్ చేరుకుంటారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు.

ఐఆర్​సీటీసీ "గ్లోరీ ఆఫ్​ గుజరాత్​ విత్​ మౌంట్​ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే!

  • ఐదో రోజు ఉదయం త్రివేణి సంగమానికి సందర్శించుకుంటారు. అనంతరం హోటల్​కి వెళ్లి బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత.. మధ్యాహ్నం సమయంలో చెక్ అవుట్ అవుతారు. అనంతరం ఆనంద్ భవన్, కుస్రో బాగ్​కు వెళ్తారు. సాయంత్రం వరకు ప్రయాగ్ రాజ్ రైల్వే జంక్షన్​కు చేరుకుంటారు. అక్కడ నుంచి రాత్రి 7:45 గంటలకు హైదరాబాద్​కు రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • ఆరో రోజు రాత్రి 09.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ కంప్లీట్​ అవుతుంది.

ధర వివరాలు చూస్తే:

  • కంఫర్ట్​(3AC)లో.. సింగిల్​ షేరింగ్​కు రూ.35,330, డబుల్​ షేరింగ్​కు రూ.21,220, ట్రిపుల్​ షేరింగ్​లో రూ.17,640గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.13,480, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.11,990 చెల్లించాలి.
  • స్టాండర్డ్​(SL)లో సింగిల్​ షేరింగ్​కు రూ.21,490, ట్విన్​ షేరింగ్​కు రూ.16,480, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.15,930గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 12,350, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.10,870గా నిర్ణయించారు.

ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • టూర్ ప్యాకేజీలో.. టికెట్లు, హోటల్‌లో వసతి, 3 బ్రేక్‌ఫాస్ట్(Breakfast), 3 డిన్నర్​లు కవర్ అవుతాయి.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • ఆలయాలు సందర్శించుకునేందుకు లోకల్​లో బస్​ ప్రొవైడ్​ చేస్తారు.
  • ప్రస్తుతం ఈ టూర్​ ప్యాకేజీ సెప్టెంబర్​ 22వ తేదీన మొదలు కానుంది. అక్టోబర్​ 6, 13, 20, 27 తేదీలలో కూడా అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

ఖజురహో అందాలు చూస్తారా? - హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.