ETV Bharat / offbeat

IRCTC దిల్లీ టూర్ - కృష్ణ జన్మభూమి మథురతోపాటు, మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు! - IRCTC HERITAGE TRIANGLE PACKAGE

-హెరిటేజ్​ ట్రయాంగిల్​ పేరుతో టూర్​ ప్యాకేజీ - దిల్లీలోని ఈ ప్రదేశాలతోపాటు మథుర కూడా చూడొచ్చు!

IRCTC Heritage Triangle Tour Package
IRCTC Heritage Triangle Tour Package (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 9:16 AM IST

IRCTC Heritage Triangle Tour Package : వందేళ్ల నాటి చరిత్ర దేశ రాజధాని దిల్లీకి సొంతం. ఇక్కడ సందర్శించడానికి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. మరి మీరు కూడా ఆ ప్రదేశాలను విజిట్​ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​ చెబుతోంది ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​. దిల్లీలోని పలు ప్రదేశాలను చూసేందుకు సూపర్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

"హెరిటేజ్​ ట్రయాంగిల్​" పేరుతో ఐఆర్​సీటీసీ ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. హైదరాబాద్​ నుంచి ట్రైన్​ ద్వారా టూర్​ ఉంటుంది. ప్రతీ సోమవారం ఈ టూర్​ ఉంటుంది. ఈ టూర్​లో భాగంగా దిల్లీ, ఆగ్రా, మథుర వంటి ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్​ నుంచి ట్రైన్​(ట్రైన్​ నెం 12723) జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 8 గంటలకు దిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అవ్వాలి. ఫ్రెష్​ అయిన తర్వాత దిల్లీలోని కుతుబ్​ మినార్​, లోటస్​ టెంపుల్​, అక్షరధామ్​ వంటి ప్రదేశాలు సందర్శించవచ్చు. ఆ రాత్రికి దిల్లీలోనే బస చేయాలి.
  • మూడో రోజు హోటల్​ చెక్​ అవుట్​ చేసి ఇండియా గేట్​, రెడ్​ ఫోర్ట్​ విజిట్​ చేయాలి. ఆ తర్వాత ఆగ్రాకు బయలుదేరుతారు. సాయంత్రానికి ఆగ్రా చేరుకుని హోటల్​లో చెకిన్​ అవుతారు. ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు.
  • నాలుగో రోజు తాజ్​ మహల్ సందర్శించవచ్చు. ఆ తర్వాత చెక్​ అవుట్​ చేసి ఆగ్రా ఫోర్ట్​ విజిట్​ చేస్తారు. అక్కడ నుంచి మథుర బయలుదేరుతారు. మథురలోని కృష్ణ జన్మభూమి దర్శించుకున్న తర్వాత ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • ఐదో రోజు హోటల్​లో చెక్​ అవుట్​ తర్వాత బృందావనం విజిట్​ చేస్తారు. మధ్యాహ్నం తర్వాత మథుర జంక్షన్​ రైల్వే స్టేషన్​లో డ్రాప్​ చేస్తారు. సాయంత్రం 5:30 గంటలకు దిల్లీ నుంచి ట్రైన్​ స్టార్ట్​ అవుతుంది. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఆరో రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ధర వివరాలు చూస్తే:

1 నుంచి 3 ప్రయాణికులకు:

  • కంఫర్ట్​లో సింగిల్​ షేరింగ్​కు రూ.41,670, డబుల్​ షేరింగ్​కు​ రూ.24,180, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.18,970 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.14,320, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.12,840 చెల్లించాలి.
  • స్టాండర్డ్​లో సింగిల్​ షేరింగ్​కు రూ.39,270, డబుల్​ షేరింగ్​కు​ రూ.21,340, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.16,220 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.11,850, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.10,540 చెల్లించాలి.

4 నుంచి 6 ప్రయాణికులకు :

  • కంఫర్ట్​లో డబుల్​ షేరింగ్​కు రూ.20,440, ట్రిపుల్​ షేరింగ్​కు​ రూ.17,590 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.14,320, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.12,840 చెల్లించాలి.
  • స్టాండర్డ్​లో డబుల్​ షేరింగ్​కు రూ.17,600, ట్రిపుల్​ షేరింగ్​కు​ రూ.14,830 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.11,850, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.10,540 చెల్లించాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు
  • హోటల్​ అకామిడేషన్​
  • 3 బ్రేక్​ఫాస్ట్​లు
  • లోకల్​ ప్లేస్​లు చూసేందుకు వెహికల్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ టూర్​ ప్యాకేజీ నవంబర్​ 18 నుంచి 2025 జనవరి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలు, టూర్​ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ to అండమాన్ - ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ - ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరొచ్చు!

IRCTC "హ్యాపీ హిమాచల్​ అండ్​ పాపులర్​ పంజాబ్​" - అందుబాటు ధరలోనే 8 రోజుల టూర్​!

IRCTC సూపర్​ ప్యాకేజీ - మీనాక్షి అమ్మన్​ ఆలయంతోపాటు ఈ ప్రదేశాలు చూడొచ్చు! - ధర కూడా అందుబాటులోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.